పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య

పాకిస్తాన్‌లో హక్కుల కార్యకర్త హత్య


కరాచీ: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హక్కుల ఉద్యమవేత్త సబీన్ మహ్మద్‌ను శుక్రవారం గుర్తుతెలియని సాయుధులు కాల్చి చంపారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మానవ హక్కులకు భంగం కలుగుతున్న అంశంపై కరాచీలో జరిగిన సెమినార్‌కు హాజరైన ఆమె.. అక్కడి నుంచి కారులో బయలుదేరిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది.



బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీలతో కాల్పులు జరపడంతో సబీన్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ సమయంలో కారులోనే ఉన్న ఆమె తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ‘ది సెకండ్ ఫ్లోర్ (టీ2ఎఫ్)’ సంస్థ డెరైక్టర్ అయిన సబీన్ ప్రజల హక్కులు కోసం పోరాడారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top