ట్రంప్‌పై హిల్లరీ ఆధిక్యం

ట్రంప్‌పై హిల్లరీ ఆధిక్యం - Sakshi


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గణనీయమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే ఆమె 7 శాతం ఓట్ల ఆధిక్యం కనబరుస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. పెన్సల్వేనియా, ఓహియో లాంటి కీలక రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా ఉంది. గత గురువారం నుంచి ఆదివారం వరకు నిర్వహించిన సర్వేలలో ట్రంప్‌కు అనుకూలంగా 39 శాతం మంది స్పందించగా, హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా 46 శాతం మంది స్పందించారు.



డెమొక్రాట్లలో 85 శాతం మంది హిల్లరీకి మద్దతు పలుకుతుండగా, రిపబ్లికన్లలో మాత్రం 78 శాతం మందే ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. స్వతంత్రులలో కూడా 37 శాతం మంది హిల్లరీకి, 32 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెబుతున్నారు. ఓహియోలో మాత్రం ఇద్దరికీ 43 శాతం చొప్పున మద్దతు వచ్చింది. మిచిగన్‌లో క్లింటన్‌కు 45 శాతం, ట్రంప్‌కు 40 శాతం, పెన్సల్వేనియాలో హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 43 శాతం మద్దతు లభించింది. ఇటీవలి కాలంలో మొత్తం మూడు సర్వేలు నిర్వహించగా అన్నింటినీ కలిపి చూస్తే హిల్లరీ క్లింటన్‌కు స్పష్టంగా 6.1 శాతం ఆధిక్యం కనబరుస్తోందని రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top