ఈయన వయసు 145 ఏళ్లట..

ఈయన వయసు 145 ఏళ్లట..


లండన్: ఇండోనేసియాకి చెందిన ఎమ్బా గోథీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏళ్లు జీవించిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. సెంట్రల్ జావా ప్రాంతంలోని స్రజెన్‌కు చెందిన ఈయన రికార్డుల ప్రకారం 1870 డిసెంబర్ 31న జన్మించారు. దీని ప్రకారం గోథీ వయసు 145 ఏళ్లు. ఇదే నిజమైతే ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా ఫ్రాన్స్‌కి చెందిన జెన్నీ కాల్మెట్(122) పేరిట ఉన్న రికార్డును తిరిగి రాయనున్నారు. 



గోథీ తోబుట్టువులు, భార్యలు, పిల్లలు అందరూ ఇప్పటికే మరణించగా, ప్రస్తుతం మనవలు, మనవరాళ్లతో కలసి ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితమే తాను చనిపోతానని భావించినప్పటికీ ఇన్నేళ్లు బతికానని, ఇంక చనిపోవాలనుందని గోథీ తెలిపారు. ఎక్కువ సమయాన్ని రేడియో వినేందుకు వెచ్చిస్తానని, సహనమే తన జీవిత రహస్యమని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top