అక్కడ స్మార్ట్ ఫోన్స్ కన్నా ఏకే 47 గన్సే చీప్

అక్కడ స్మార్ట్ ఫోన్స్ కన్నా ఏకే 47 గన్సే చీప్ - Sakshi


డర్రా అదమ్ఖేల్: అక్కడ తుపాకులు దొరుకుతాయి. చిన్నస్థాయి నుంచి ఏకే 47 తుపాకుల వరకు. ఎలా అంటే అలా.. ఎంతకంటే అంతకు.. ఓ రకంగా చెప్పాలంటే కూరగాయల మార్కెట్లో బేరమాడినట్లుగా ఆడి వాటిని సొంతం చేసుకోవచ్చు. వీటి ధర ఎంతో తెలుసా నేడు మనం కొనుగోలు చేస్తున్నా స్మార్ట్ ఫోన్స్ కంటే తక్కువ. అదే అక్కడ తుపాకుల ప్రత్యేకత. అయితే, అవన్నీ కూడా అక్కడే తయారయ్యేది. స్క్రాప్ మెటీరియల్ తో వాటిని తీర్చిదిద్దుతారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడని అనుకుంటున్నారా..  అదే డర్రా అదమ్ఖేల్. పాకిస్థాన్లోని ఓ మూరుమూల గిరిజన ప్రాంతం.



పేరుకే గిరిజన ప్రాంతం అని చెప్పినా అదొక గన్స్ బ్లాక్ మార్కెట్ల పెద్ద అడ్డ. ప్రారంభకాలంలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నా కాలక్రమంలో వాటికి ఉగ్రవాదుల అండదొరకడంతో ఆ గ్రామంలో వారంతా తుపాకుల తయారీపైనే పడ్డారు. చిన్న సైజు రైఫిల్స్ నుంచి ఏకే 47 వరకు సొంతంగా తయారు చేసి అమ్ముతుంటారు. ఇది పెషావర్ కు 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న గిరిజన ప్రాంతం. ఆ చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం కూడా ఇదే ఊరు.



ఇక్కడ ఒక్క గన్సే కాదు.. నకిలీ సర్టిఫికెట్లు, మత్తు పదార్థాల రవాణా, డ్రగ్స్ డీలర్ షాపులు సమాజానికి ఏమేం పనికి రావో వాటన్నింటికి డర్రా పెద్ద ఆశ్రయం. దీనిపై ఎవరూ చర్యలు తీసుకోలేదా అంటే అలా జరగలేదు. ఎందుకంటే ఇది దాదాపుగా రెండు దశాబ్దాలుగా మనుగడ కొనసాగిస్తోంది. 1980లో ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించగా తొలిసారి ఉగ్రవాద సంస్థ ముజహిదీన్ ఇక్కడి నుంచి గన్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇది పూర్తి స్థాయిలో తాలిబన్ చేతిలోకి వెళ్లాక గన్స్ తయారీ ఎక్కువైంది. ఇక్కడ ఒక్కో తుపాకీ ఎంతకు లభిస్తుందో తెలుసా 67 డాలర్లు.. అంటే రూ.7 వేలు అన్నమాట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top