ఐఎస్ కమాండ్ సెంటర్ ధ్వంసం

ఐఎస్ కమాండ్ సెంటర్ ధ్వంసం


వాషింగ్టన్: తమ దేశంపై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఫ్రాన్స్ రగిలిపోతుంది. దాడి జరిగిన రోజు నుంచి సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఫ్రెంచ్ యుద్ధ విమానాలు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కమాండ్ సెంటర్ ను, ఓ శిక్షణా శిబిరాన్ని ధ్వంసం చేశాయి.



ఉగ్రవాదులు అలికిడి ఎక్కువగా ఉండే మోసుల్ లో ఈ దాడి నిర్వహించాయి. తాల్ అఫర్ అనే పట్టణానికి సమీపంలో దాడి జరిగిన ప్రాంతం ఉన్నట్లు ఫ్రెంచ్ సేనలు చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాకోయిస్ హాలెండే భేటీ అయిన సమయంలో ఈ దాడులు జరిగాయి. ఇస్లామిక్ స్టేట్ ను పూర్తిగా తుదముట్టించాలనే ఆగ్రహంతో ఫ్రాన్స్, అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top