తల్లీ కొడుకును కలిపిన ఫేస్ బుక్!

తల్లీ కొడుకును కలిపిన ఫేస్ బుక్! - Sakshi


న్యూయార్క్: అచ్చం సినిమా కథను తలపించే సంఘటన న్యూయార్క్  లో చోటు చేసుకుంది. చిన్నతనంలోనే  కన్న తండ్రి ద్వారా అపహరణకు గురైన ఓ పిల్లాడు.. 15 వ సంవత్సరాల తరువాత ఫేస్ బుక్ ద్వారా తన వారికి దగ్గరైతే ఎలా ఉంటుంది. ఆ కుటుంబం ఆనందానికి హద్దులే ఉండవు కదా.



కుటుంబంలోవివాదాలు కారణంగా జోనాథన్(18) అనే  యువకుడ్ని బాల్యంలోనే తండ్రి కిడ్నాప్ చేసి మెక్పికోకు తీసుకుపోయాడు. తండ్రి కిడ్నాప్ చేసే సమయానికి జోనాథన్ వయసు  సరిగ్గా మూడేళ్లు. బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలియని వయస్సులో కిడ్నాప్ గురైన జోనాథన్ మెక్సికోలోనే పెరిగి పెద్ద వాడైయ్యాడు. అయితే ఏడాది క్రితం అతని చిన్నతనంలో అన్నతో కలిసి ఉన్న ఫోటోను  ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆలోచనలో పడ్డ తల్లి హోప్ హాలెండ్ అతను తన బిడ్డగా గుర్తించింది.  తన కొడుకును తిరిగి స్వదేశానికి(అమెరికా)కు తెచ్చుకోవాలని సంకల్పించింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అతని కోసం మరింతగా అన్వేషించి ఎట్టకేలకు ఆచూకీ తెలుసుకుంది. ఆ బిడ్డపై ఏనాడో ఆశలు వదులుకున్నామని.. అయితే తిరిగి జోనాథన్ తమను కలవడం నిజంగా అద్భుతమేనని పేర్కొంది.


 


'నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుదీర్ఘమైన నిరీక్షణ ఫలించింది. తొలుత ఫేస్ బుక్ లో మా పిల్లలు ఇద్దరూ కలిసి స్నానం చేస్తున్న చిన్నప్పటి ఫోటో చూసి ఆశ్చర్యానికి గురైయ్యా. ఆ ఫోటో చూశాక నా శ్వాస కూడా అదుపు తప్పింది. ప్రస్తుతం నా కొడుకు జోనాథన్ తో ఫోన్ లో మాట్లాడా.  ప్రస్తుతం హై స్కూళ్లో విద్యాభ్యాసం చేస్తున్న జోనాథన్ అది పూర్తయిన తరువాత తాము ఉంటున్న కాలిఫోర్నియాకు వస్తాడు' అని తల్లి ఆనందంతో పొంగిపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top