ఒబామా లేఖను భద్రంగా దాచుకుంటా: ట్రంప్‌

ఒబామా లేఖను భద్రంగా దాచుకుంటా: ట్రంప్‌ - Sakshi


వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కోసం ప్రస్తుత కొత్త అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొన్ని క్షణాలపాటు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన పేరును పలువురి ప్రముఖుల మధ్య గొప్పగా పలికారు. గతంలో ఒబామాను ఓ పనికిమాలిన అధ్యక్షుడు అన్న ఆయన స్వయంగా ఒబామాను కీర్తించారు. ఒబామా తనకు ఒక అందమైన లేఖను రాశారని చెప్పడమే కాకుండా ఆ లేఖను తీసి పైభాగం వరకు చూపిస్తూ ఒబామా సంతకంవైపు తీక్షణగా చూసి ఈ లేఖను చాలా భద్రంగా దాచిపెడతానని, అందులోని అంశాలను తన మనసులో ఉంచుకొని గౌరవిస్తానని అన్నారు.



అనంతరం ఆ లేఖను తన కోటులోపలి పాకెట్‌లో పెట్టుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ట్రంప్‌ పరిపాలన వర్గంలోని ప్రముఖులందరికీ ఓ పార్టీని ట్రంప్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్వేతసౌదంలో నాకోసం ఒబామా ఓ అందమైన లేఖను ఉంచి వెళ్లారు. నేను ఇంతకుముందే ఓవల్‌ కార్యాలయానికి వెళ్లి దీనిని గుర్తించాను. నిజంగా ఇది ఒబామా రాసిన అందమైన లేఖ. చాలాచాలా బాగుంది. మేం దీనిని భద్రంగా అలాగే ఉంచుతాం. ఆ లేఖలో ఏం ఉందనేది మీడియాకు కూడా చెప్పం' అని ట్రంప్‌ స్పష్టం చేశారు.


Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top