మీడియా విందుకు ట్రంప్‌ డుమ్మా

మీడియా విందుకు ట్రంప్‌ డుమ్మా - Sakshi


హాజరు కావడంలేదని ట్విటర్‌లో వెల్లడించిన అధ్యక్షుడు

వాషింగ్టన్ : మీడియాపై తరచూ నోరుపారేసు కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. జర్నలిస్టులపై తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. జర్నలిజం స్కాలర్‌షిప్‌లకోసం ప్రతి ఏటా వైట్‌హౌస్‌ కరస్పాండెట్స్‌ అసోసి యేషన్  (డబ్ల్యూహెచ్‌సీఏ) నిర్వహించే విందు కు తాను హాజరుకావడంలేదని చెప్పారు.


దశాబ్దాల తర్వాత ఈ విందుకు డుమ్మా కొట్టిన అధ్యక్షుడు ట్రంపే కావడ గమనార్హం. ‘‘వైట్‌ హౌస్‌ కరస్పాండెంట్ల విందుకు నేను హాజరుకావడంలేదు. అందరికీ శుభాకాంక్షలు, విందు బాగా జరగాలని కోరుకుంటు న్నా’’ అని ట్విటర్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు. జర్నలిజం స్కాలర్‌షిప్‌ ఫండ్‌ కోసం ప్రతి ఏటా ఈ విందును నిర్వహిస్తారు. దీనికి అమెరికా అధ్యక్షుడు, జర్నలిస్టులు, ప్రముఖులు హాజరవుతారు. 1920లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.


ఈ ఏడాది ఏప్రిల్‌ 29న విందు ఏర్పాటు చేశారు. 1972లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్ ఈ విందుకు హాజరు కాలేదు. నిక్సన్  తర్వాత ట్రంప్‌ ఈ విందుకు హాజరుకావడంలేదు. 1981లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్  కూడా విందుకు వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అంతకుముందు ఆయనపై హత్యాయత్నం జరగడంతో దాని నుంచి కోలుకునే క్రమంలో విందులో పాల్గొనలేకపోయారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top