పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌కు పైరేట్స్‌ దెబ్బ!

పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌కు పైరేట్స్‌ దెబ్బ!


'డిస్నీ' హాలీవుడ్‌ భారీ నిర్మాణ సంస్ధ. ఇప్పుడు వాన్నా క్రై హ్యాకర్ల దెబ్బకు విలవిల్లాడుతోంది. డిస్నీ సంస్ధకు చెందిన సర్వర్లను వాన్నా క్రై హ్యాక్‌ చేసింది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సంస్ధ సినిమాల ఒరిజినల్‌ ప్రింట్స్‌ హ్యాకర్ల చేతికి వెళ్లాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సిరీస్‌లో తర్వాతి భాగమైన డెడ్‌ మెన్‌ టెల్‌ నో టేల్స్‌ ఉంది.


తాము కోరిన మొత్తాన్ని బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే డెడ్‌ మెన్‌ టెల్‌ నో టేల్స్‌ అనే సినిమాతో పాటు మరొకొన్ని సినిమాలను కూడా ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేస్తామని వాన్నా క్రై హెచ్చరించినట్లు తెలిసింది. వాన్నా క్రై డిమాండ్‌పై స్పందించిన డిస్నీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బాబ్‌ ఐగర్‌ డబ్బును చెల్లించేందుకు నిరాకరించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.



ఐగర్‌ నిర్ణయంపై స్పందించిన వాన్నా క్రై హ్యాకర్లు బిట్‌కాయిన్ల రూపంలో డాలర్లను చెల్లించకపోతే.. 20 నిమిషాల వ్యవధిలో సినిమాలన్నింటినీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా, ఈ నెల 26వ తేదీన డెడ్‌ మెన్‌ టెల్‌ నో టేల్స్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పైరేట్స్‌ ఆప్‌ ది కరేబియన్‌కు భారత్‌లో కూడా మంచి క్రేజ్‌ ఉంది. హ్యాకర్ల హెచ్చరికలపై డిస్నీ ఎఫ్‌బీఐను డిస్నీ సంప్రదిస్తున్నట్లు తెలిసింది.


వాన్నా క్రై కంప్యూటర్లను హ్యాక్‌ చేయడానికి ఉపయోగిస్తున్న లూప్‌హోల్‌ను తొలగిస్తూ మైక్రోసాఫ్ట్‌ కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top