'లొంగిపోనన్నాడు.. అందుకే చంపాం'

'లొంగిపోనన్నాడు.. అందుకే చంపాం'


ఢాకా: బంగ్లాదేశ్లోని ఢాకా కేఫ్ మారణ హోమానికి కారణమైన కీలక సూత్రదారి లొంగిపోయేందుకు నిరాకరించడమే కాకుండా దాడులకు దిగడం వల్లే ప్రతిదాడులు చేసి హతమార్చామని ఢాకా బలగాలు తెలిపాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్‌పై గత నెలలో ఉగ్రవాదులు దాడి చేసి ఒక భారతీయురాలు, 16మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయారు. దీని సూత్రధారి తమీమ్ అహ్మద్ చౌదురి(30)గా బంగ్లా భద్రతా బలగాలు గుర్తించాయి. ఇతడు బంగ్లాదేశ్ సంతతికి చెందిన కెనడా పౌరుడు.



దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను అతనే ఢాకాలోని గుల్షన్ ప్రాంతానికి తీసుకొచ్చాడని.. మారణకాండ మొదలయ్యే కొద్ది సేపటి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. దీంతో అప్పటి నుంచి బలగాలు అతడికోసం గాలిస్తున్నాయి. ఢాకా శివార్లలోని నారాయణ్‌గంజ్ ప్రాంతంలోని ఓ భవనంలో తమీమ్ ఉన్నట్టు సమాచారం అందడంతో ఆపరేషన్ చేపట్టారు. భద్రతా బలగాలు భవనంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను కార్నర్ చేసినప్పటికీ వారు లొగిపోకుండా కాల్పులకు తెగబడ్డారు. దీంతో సుమారు గంటపాటు జరిగిన కాల్పుల్లో ఎట్టకేలకు తమీమ్ చనిపోయాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top