దలైలామా పర్యటనతో సంబంధాలకు చేటు

దలైలామా పర్యటనతో సంబంధాలకు చేటు


బీజింగ్: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్‌ప్రదేశ్ పర్యటించడం  వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని భారత్‌ను చైనా హెచ్చరించింది. అరుణాచల్‌ను దక్షిణ  టిబెట్‌లో భూభాగంగా పేర్కొంటున్న చైనా ఆ ప్రాంతంలోకి దలైలామాను ఆహ్వానిస్తే సరిహద్దుల్లో శాంతి సుస్థిరతలు దెబ్బతినే అవకాశం ఉందని, ఈ విషయాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తుందని ఆ దేశ ప్రతినిధి లు కాంగ్ చెప్పారు.  చైనాలో వేర్పాటువాదాన్ని దలైలామా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top