'పెళ్లికి ముందు వద్దు... పెళ్లయ్యాక వివాహేతర సంబంధం ముద్దు'

'పెళ్లికి ముందు వద్దు... పెళ్లయ్యాక వివాహేతర సంబంధం ముద్దు' - Sakshi


వివాహ వ్యవస్థకు పెద్ద పీట వేసే భారత దేశం వివాహేత సంబంధాలను ఆమోదిస్తుందా లేక తిరస్కరిస్తుందా? తిరస్కరిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ వివాహేతర సంబంధాలను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఆమోదించే దేశాల్లో భారతదేశం కూడా ఉంది. షాకిచ్చే ఈ నిజం అమెరికాలో ప్యూ రిసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.




జర్మన్లకు ఆల్కహాల్ తాగడం ఓకే. ఫిలిప్పీన్స్ ప్రజలకు అబార్షన్ నాట్ ఓకే. ఫ్రాన్స్ కి పెళ్లైన వారు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఇండియా ఈ మూడింటినీ తిరస్కరిస్తోందని సర్వే చెబుతోంది. కానీ వివాహేతర సంబంధాలను ఆమోదించడంలో మాత్రం ఇండియా ముందుంది.




పెళ్లైన వారు ఇంకో మహిళతో సంబంధం పెట్టుకుంటే తప్పు లేదని 17 శాతం చెక్ రిపబ్లిక్ ప్రజలు భావిస్తున్నారు. 14 శాతం మంది భారతీయులకు కూడా ఇది ఓకే. ఈ విషయంలో చిలీ, వెనిజువెలా, జపాన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అర్జెంటీనాలకన్నా మనం ముందున్నాం.




అయితే పెళ్లికాని అబ్బాయి అమ్మాయిల మధ్య సెక్స్ విషయంలో మాత్రం మనం చాలా స్ట్రిక్ట్. 67 శాతం మంది చెక్ ప్రజలు దీనికి ఓకే. కానీ పదిశాతం భారతీయులే ఓకే అంటున్నారట. 67 శాతం మంది భారతీయులు దీన్ని అనైతికంగా  భావిస్తున్నారట. హోమో సెక్సువాలిటీ విషయంలోనూ మనది కాస్త పాత భావాలే. తొమ్మిది శాతం మందే దీనికి ఓకే.




మరి ఇవన్నీ వద్దంటున్న భారతీయులు వివాహేతర సంబంధం విషయంలో ఎందుకు లిబరల్ గా ఉన్నారన్నదే విశ్లేషించాల్సిన ప్రశ్న. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను ప్రశ్నించి, ఈ సర్వే నిర్వహించారు. మొత్తం మీద ఇండియన్లు పెళ్లి తరువాత ఏం చేయడానికైనా లైసెన్సు వచ్చినట్టు భావిస్తున్నారన్న మాట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top