దత్తతకు వచ్చే అమ్మకు రూ.98 లక్షలు!

దత్తతకు వచ్చే అమ్మకు రూ.98 లక్షలు! - Sakshi


ఓ యువకుడి ఆఫర్

 బీజింగ్: పిల్లలను, జంతువులను దత్తత తీసుకోవడం మనకు తెలుసు. అయితే చైనాకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు మాత్రం దత్తమాత కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు అమ్మగా దత్తతకు వచ్చే మహిళకు రూ.98 లక్షలు ఇస్తానని చెబుతున్నాడు. ఆమె బాగా చదువుకుంని ఉండాలని, వయసు కనీసం 57 ఏళ్లు ఉండాలని, మత్తుపదార్థాలు వాడిన చరిత్ర ఉండకూడదని, విదేశీయాన అనుభవముండాలని షరతులు పెడుతున్నాడు.



 సిచూన్ ప్రొవిన్స్లో గువాంగాన్‌లోని ఫంఘు పార్కులో  ఆ యువకుడు ఈ ఆఫర్ వివరాలు, తన ఫోన్ నంబర్ ప్రదర్శిస్తూ తీయుంచుకున్న ఫొటోలు  ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయని ecns.cn అనే వెబ్‌సైట్ తెలిపింది. అతని చేతిలో ఓ గిన్నె ఉందని, ఆ గిన్నె నిండా డబ్బు కూడా ఉందని ఆ వెబ్సైట్ వివరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top