15 సెకండ్లలో 16 బుల్లెట్లు దిగాయి

15 సెకండ్లలో 16 బుల్లెట్లు దిగాయి - Sakshi


చికాగో: అది చికాగో నగరం. 2014 అక్టోబర్ 20 రాత్రి 9.47గంటల ప్రాంతం. ఆ సమయంలో ఓ వీధిలోని అక్కడి రోడ్డంతా రాత్రి విద్యుత్ వెలుగులతోపాటు రద్దీగా వచ్చిపోయే వాహనాల వెలుగులతో స్పష్టంగా కనిపిస్తోంది. మెక్ డోనాల్డ్ (17) అనే ఓ నల్లజాతి యువకుడు ఆ వీధి రోడ్డు దాటుతూ వస్తున్నాడు. అతడి చేతిలో ఏదో కత్తిలాంటి వస్తువు ఉంది. అంతలో 9.53 గంటల ప్రాంతంలో ఓ పోలీసు వాహనం అతడిని సమీపిస్తూ వచ్చింది. భయంతో ఆ యువకుడు వేగంగా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.



దాంతో వెంటనే ఆ పోలీసులు నడిరోడ్డుపై తమ వాహనాన్ని నిలిపివేశారు. ఆ బాలుడిని కనీసం ఆగిపొమ్మని హెచ్చరించలేదు, అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి పోలీసుల్లో ఒకడైన వ్యాన్ డైక్ అనే పోలీసు అధికారి వెంటనే తన గన్ తీసి కాల్పులు జరిపాడు. తొలి బుల్లెట్ కాలికి తగిలి ఆ బాలుడు నడి రోడ్డుపై పడిపోయాడు. కొంచెం ఓపిక తెచ్చుకుని తన కాలిని దగ్గరకు లాక్కునే ప్రయత్నం చేయగా మరో బుల్లెట్ షాట్.. ఆ వెంటనే మరొకటి అతడి చెస్ట్ పై అలా మొత్తం 15 సెకన్లలో పదహారు బుల్లెట్లు చకచకా అతడి బాడీలోకి దూసుకెళ్లి రక్తపు మడుగులో నేలకొరిగాడు.



ఈ వీడియో తాజాగా బయటపడటంతో ఒక్కసారిగా చికాగోలోని నల్లజాతి పౌరులంతా భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసు అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వేగంగా చర్యలు తీసుకోవడంతో వారంతా కాస్త శాంతించారు. ప్రస్తుతం ఆ కాల్పులు జరిపిన పోలీసు అధికారి వ్యాన్ డైక్ పై కోర్టు దారుణ హత్య కేసు నమోదు చేసింది. ఇలాంటి కేసుకు సాధారణంగా అక్కడ ఉరి శిక్ష పడుతుంటుంది. కాగా, ఆ బాలుడు ఆ ఓజు తమపై దాడికి ప్రయత్నం చేశాడని, తమ వాహనం టైరును కోసే ప్రయత్నం చేశాడని డైక్ తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పడం గమనార్హం. చికాగోలో ఈ తరహా ఘటన జరగడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top