వేలిముద్రలు దొరక్కుండా..నమిలి మింగాడు
హోస్టన్: హోస్టన్‌లో ఓ దొంగ.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా చేతివేళ్లనే నమిలి మింగేశాడు. వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాకి చెందిన 20 ఏళ్ల రాబర్ట్ అనే దొంగ మెర్సిడిస్ కారును దొంగిలించి వెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో విచారణ కోసం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని వాహనం వెనుక వైపు కూర్చోపెట్టారు.
ఎక్కడ తన పూర్తి సమాచారం పోలీసులకు తెలిసి పోతుందేమో అని అతగాడు ఏకంగా తన చేతి వేళ్లకు వేలిముద్రలున్న చర్మాన్ని నమిలి మింగాడు. అయితే ఆ వాహనంలో అమర్చిన సీసీ కెమెరాలో ఈ మొత్తం తతంగం రికార్డయింది. పోలీసులకు తన వివరాలు దొరకకుండా ఇంత తెగించినా.. అత్యాధునిక స్కానర్లతో అతని వివరాలను పోలీసులు రాబట్టారు. అతని నుంచి క్రెడిట్ కార్డులు, దాచి ఉంచిన గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాబర్ట్ అనుమతి లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటునట్టు పోలీసులు గుర్తించారు.