సినీ ఫక్కీలో చోరీయత్నం.. ఎన్నో ట్విస్టులు!

సినీ ఫక్కీలో చోరీయత్నం.. ఎన్నో ట్విస్టులు!


కాలిఫోర్నియా: చోరీకి యత్నించిన మహిళ ఏం చేయాలో పాలుపోక బ్యాంకు నుంచి పరారయింది. చివరికి ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని వెస్ట్ డాన్ విల్లేలో గత మంగళవారం చోటుచేసుకుంది. అయితే ఇందులో కొన్ని ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయి. చోరీకి యత్నించిన మహిళ పేరు జెన్నిఫర్ రే మెక్ క్లారీ(36). ఆమె రెండు రోజుల కిందట వెస్ట్ డాన్ విల్లేలోని బ్యాంకులో చోరీకి యత్నించింది. మహిళగా వెళ్తే తనను ఎవరూ లెక్కచేయరని భావించి, పురుషుడిగా కనిపించడానికి తనకు గెడ్డం ఉన్నట్లు కనిపించాలని నలుపురంగు రుద్దుకుంది.



బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంటు ధరించిన ఆ మహిళ బ్లాక్ కళ్లద్దాలు, క్యాప్ తో బ్యాంకులో ప్రవేశించింది. ఓ ఉద్యోగి వద్దకు వెళ్లి ఎలాంటి ఆయుధం చూపించకుండానే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమెను మహిళ అని గుర్తించారనుకుని భయపడి బ్యాంకు నుంచి వెంటనే కాలికి బుద్దిచెప్పింది. బ్యాంకు నుంచి సమాచారం అందుకున్న డాన్ విల్లే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. డబ్ల్యూ ఈఐ పింటాడో రోడ్-డయాబ్లో రోడ్ జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, విచారణ చేయగా ఆమె మహిళ అని వెల్లడైందన్నారు.



డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లి చోరీకి యత్నించినట్లు విచారణలో ఒప్పుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో పోలీసు జాబ్ కు ఎంపికైన జెన్నిఫర్ 18 నెలల ప్రొబేషనరీ టైమ్ తర్వాత 2010లో ఆమె ఫర్మార్మెన్స్ బాగాలేదని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచీ ఇలా ఏదోఒక తరహాలో ఆమె చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గతంలో డిపార్ట్ మెంట్ తో సంబంధం ఉన్న మహిళ ఇలా చేయడంపై షాక్ కు గురయ్యామని చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top