విమానం కిటికీలోంచి తీసిన షాకింగ్ వీడియో

విమానం కిటికీలోంచి తీసిన షాకింగ్ వీడియో


విమానంలో విహరిస్తూ విండోలోంచి బయటకు వీక్షిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఒక్కసారిగా షాక్కు గురైంది. సబ్రీనియా ఫవాజ్ తన భర్తతో కలిసి బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బీఏ108 విమానంలో దుబాయి నుంచి లండన్ బయలుదేరారు. విండోలోంచి బయటకు చూస్తున్న తనకు ఒక్కసారిగా యద్ధాలకు ఉపయోగించే జెట్ విమానం, అది కూడా అతి సమీపంలోంచి చూసే సరికి గుండె గుభేలుమందని ఫవాజ్ తెలిపారు. అయితే విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయి హంగేరియా గగనతలంలోకి ప్రవేశించింది. అనుమతిలేకుండా తమ గగన తలంలోకి ప్రవేశించిన విమానానికి ముందుగా హైఅలర్ట్ జారీ చేసి రెండు జెట్ విమానాలను(యుద్ధవిమానాలు) హంగేరియా వైమానికదళం పంపింది. రెండు జెట్ ప్లేన్లను విమానానికి దగ్గరగా పంపింది.



దీనిగురించి కనీసం సమాచారం కూడా తెలియని ప్రయాణికులు వాటిని అంత దగ్గరగా చూసి అవి విమానాన్ని పేల్చేస్తాయేమో అని భయబ్రాంతులకు గురయ్యారు. 'ఎదో తప్పిదం జరిగింది. బయటకూడా అంతా తేడాగా కనిపిస్తుంది. ఈ హఠాత్పరిణామాన్ని చూసి ఒక్కసారిగా నా గొంతు ఎండిపోయింది. వెంటనే విమాన సిబ్బందిని కలిసి జెట్ విమానాలగురించి ఆరా తీసా' అని ఫవాజ్ తెలిపారు.



కంగారుపడాల్సిన పని లేదని ఎప్పుడైనా కంట్రోల్ రూంతో కమ్యునికేషన్ కట్ అయితే ఇలా జరుగుతుందిని సిబ్బంది ఆమెకు దైర్యం చెప్పారు. కొంత ఆలస్యమైనా క్షేమంగా లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి చేరుకోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. విండో నుంచి జెట్ విమానాన్ని తీసిన వీడియోను ఫవాజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానానికి అతి సమీపంగా జెట్ విమానం వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top