సడెన్గా మూడు కార్లు గాల్లోకి లేచాయి..

సడెన్గా మూడు కార్లు గాల్లోకి లేచాయి..


చైనా: మాయల పకీరు సినిమాల్లో కనుసైగలు, చేతిలో మాయాదండాన్ని కదపగానే నేలపై ఉన్న వస్తువులను గాల్లోకి ఎగిరినట్లే చైనాలోని ఓ పట్టణంలో రహదారిపై వాహనాలు ఉన్నట్లుండి గాల్లో తేలాయి. మూడు వాహనాలు చుట్టుపక్కలవారిని ఆశ్చర్యానికి గురిచేస్తూ వాటంతటవే పడిపోయాయి. వివరాల్లోకి వెళితే అది చైనాలోని బిజీగా ఉండే జింటాయి ప్రాంతంలో. అక్కడి రహదారి ఎప్పుడూ తీరిక లేకుండా రద్దీగా ఉంటుంది. గతవారం ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఓ దృశ్యం సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.



వేగంగా వచ్చిన వాహనం ఒకటి సరిగ్గా సిగ్నల్ను సమీపిస్తుండగానే ఉన్నట్లుండి అకస్మాత్తుగా గాల్లోకి లేచి పక్కనే ఉన్న వాహనం పై పడిపోయింది. ఆ వాహనం కూడా గాల్లోకి లేచి కిందపడగా.. దాని పక్కనుంచి వెళుతున్న వాహనం కూడా ఎవరో పైకి ఎత్తే క్రమంలో అటుఇటు కుదిపేసినట్లుగా రోడ్డుపై కదులుతూ ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఆ వాహానాల్లోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, అదృశ్య శక్తుల వల్ల ఆ వాహనాలు గాల్లోకి లేవలేదని, ఒక సన్నటి వైరు వాటికి అనుకోకుండా తగులుకోని ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top