బంగ్లాదేశ్ యుద్ధ నేరస్తుడు ఆజమ్ మృతి


ఢాకా: బంగ్లాదేశ్ యుద్ధ నేరస్తుడు, మత ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులామ్ ఆజమ్ (92) గురువారం రాత్రి ఢాకాలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం పొందేందుకు బంగ్లాదేశ్ 1971లో జరిపిన యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సామాన్య ప్రజలపై అఘాయిత్యాలకు ఛాందసవాదులను ఉసిగొల్పినందుకు ప్రత్యేక కోర్టు ఆయనకు గత ఏడాది 90 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన్ను పోలీసులు మూడేళ్ల కిందటే అరెస్టు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top