'నేను మాత్రం భారత్తో యుద్ధం చేస్తా'

'నేను మాత్రం భారత్తో యుద్ధం చేస్తా'


కరాచీ: బెలూచిస్థాన్ రగడంతో ఇద్దరు సోదరులు ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందాన తయారయ్యారు. పాకిస్థాన్ చేస్తున్న దుర్మార్గాలను ఎండగడుతూ తమకు స్వాతంత్ర్యం కావాలని నినదించిన ప్రత్యేక బెలూచిస్థాన్ మద్దతుదారు బ్రహందాగ్ బుగ్తీ భారత్కు మద్దతు ఇస్తుండగా అతడి సోదరుడు మాత్రం తాను పాకిస్థాన్కే మద్దతు ఇస్తానని చెబుతున్నాడు. పాక్ తో భారత్ యుద్ధం చేస్తే తాము మాత్రం పాక్ తరుపునే పోరాడుతామని, భారత సేనలతో తలపడుతామని ప్రకటించాడు.



బెలూచిస్థాన్ లోని హత్యకు గురైన గిరిజన నేత నవాబ్ అక్బర్ బుక్తి కుమారుడు షాజెయిన్ బుగ్తి ప్రత్యేక బెలూచిస్తాన్ దేశ మద్దతుదారు బ్రహందాగ్ బుగ్తీకి సోదరుడు. బ్రహందాగ్ ప్రస్తుతం బెలూచిస్తాన్ హక్కుల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా తన గొంతును వినిపిస్తుండటమే కాకుండా ప్రస్తుతం భారత్లో రక్షణ కోరుతూ దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి సోదరుడు షాజెయిన్ ను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా



'బ్రహం దాగ్ భారత్ తో ఉండొచ్చు.. జెనీవాతో ఉండొచ్చు అది అతడి వ్యక్తిగత నిర్ణయం. నేనైనా, నా గిరిజన సమాజం అయినా మా నేత హత్యకు గురైన నవాబ్ అక్బర్ బుగ్తీ ఆదేశాలను మేం పాటిస్తాం. నవాబ్ ఎప్పుడూ పాకిస్థాన్ కు మద్దతిచ్చేవారు. ఆయన పోరాటం, సిద్ధాంతం ఎప్పుడూ పాక్ కు అనుకూలంగా ఉండేది. ఇందులో ఏ మార్పు లేదు. మా సిద్ధాంతం కూడా ఎప్పుడూ ఒకటే. ఇప్పటిప్పుడు భారత్ పాక్ తో యుద్ధం చేస్తే మేం పాకిస్థాన్ సరిహద్దులు కాపాడేందుకు ప్రయత్నిస్తాం. పాక్ సేనలకు అండగా ఉంటాం. భారత సేనలతో యుద్ధం చేస్తాం' అని చెప్పాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top