ట్రంప్ ప్రమాణ ఈవెంట్లో తెలుగు వ్యక్తి




అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అరిజోనా రిపబ్లికన్‌ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇరగవరపు అవినాశ్‌ హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేసి, ఆయన విజయంలో కీలకపాత్ర పోషించిన కొద్దిమందిలో అవినాశ్ ఒకరు. రిపబ్లికన్ పార్టీ నేత అవినాశ్‌ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం.



వాషింగ్టన్ నుంచి అవినాశ్ మాట్లాడుతూ.. ఒబామా కేర్‌ను సమూలంగా మార్చి, ఇందులో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై ట్రంప్‌ కి ఇప్పటికే ఒక అవగాహన ఉందని అవినాశ్ తెలిపారు. ఉగ్రవాదులకు, అక్రమ శరణార్థులకు సమస్యలు తప్పవని.. చైనా యే పెద్ద ప్రమాదంగా ట్రంప్‌ భావిస్తున్నారని చెప్పారు.  



రాజకీయాలపై ఉన్న ఆసక్తితో న్యూఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు బెంగళూరు, హైదరాబాద్‌ లోనూ పనిచేసిన అవినాశ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తరఫున పనిచేశానని వివరించారు.






Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top