బాంబుల హోరు... విమానాల జోరు...
ప్రపంచంపై ఆధిపత్య పోరు నేపథ్యంలో కన్నెర్రజేసిన అగ్రరాజ్యాలు.. మూడో ప్రపంచ యుద్ధం చేసినట్లుంది కదూ ఈ ఫొటో. నిజంగా మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే ఇలాంటి ఫోటో తీయడానికి, తీసినా చూడడానికి జనం ఉంటారో లేదో తెలియదు కానీ, ఇదైతే ఆ దృశ్యం కాదు. ఈ ఫొటో ఆస్ట్రేలియాలోని లారా నగరంలో జరుగుతున్న ‘ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో’లో తీసింది. ఒళ్లు జలదరించేలా అద్భుతవైమానిక విన్యాసాలతో శుక్రవారం షో ఇలా ప్రారంభమైంది. ఎగసిపడుతున్న మంటలపై నుంచి వివిధ విమానాలు విన్యాసాలు చేయడం చూపరులను ఆకట్టుకుంది.