పోలీసులపై దాడి.. 43 మంది దుండగుల హతం
మెక్సికో: మెక్సికోలో పోలీసుల కాల్పుల్లో కనీసం 43 మంది సాయుధులు మరణించారు. మిచోకెన్ రాష్ట్రంలో దుండగులు ఫెడరల్ పోలీసులపై దాడి చేశారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి దుండగులను హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి అధికారిక నివేదిక రావాల్సివుందని మిచోకెన్ గవర్నర్ సాల్వడర్ చెప్పారు. కాగా అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, సాయుధులు దాడి చేసినట్టు తెలిపారు. ఘటన స్థలానికి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.