'ముద్దు' లొలికే కళాఖండాలు..!

'ముద్దు' లొలికే కళాఖండాలు..!


కెనడాః కాన్వాస్ పై ఓ చిత్రకారిణి.. ముద్దుల వర్షం కురిపిస్తోంది. అధరాల అందాలను  కళాఖండాలుగా మలుస్తోంది. ముఖారవిందానికి మరింత అందాన్నిచ్చే లిప్ స్టిక్ నే తన పెయింట్ గా మార్చుకొని... ముద్దులతో విభిన్న రూపాలకు ప్రాణంపోస్తోంది.



టొరంటోకు చెందిన చిత్రకారిణి.. మేకప్ ఆర్టిస్ట్ అలెక్సిస్ ఫ్రేజర్.. కుంచెకు బదులు.. అధరాలను ఆయుధంగా చేసుకుంది. కాన్వాస్ పై కళారూపాలను సాక్షాత్కరింపజేసేందుకు ఏకేఏ లిప్ స్టిక్ లెక్స్.. ను వినియోగిస్తూ.. అద్భుత కళాఖండాలను రూపొందిస్తోంది. తాను గీసే చిత్రాన్ని బట్టి... సరైన స్థానంలో సరిగా పేర్చే లిప్ స్టిక్ ప్రింట్లే..  కళాభిమానుల మనో ఫలకంపై చెరగని ముద్రలు వేస్తున్నాయి. ఆయిల్ పెయింటింగ్ లో స్పెషలిస్ట్ అయిన ఫ్రేజర్..  'కిస్ ప్రింట్ పాయింటలిజమ్' లోనూ ప్రత్యేకతను సాధించింది. తన అధరాలకు రంగును (లిప్ స్టిక్) అద్దుకొని కాన్వాస్ పై పెట్టే ముద్దులే.. కళారూపాలుగా మారుతున్నాయి. ఆమె రూపొందించే చిత్రాల్లో అధికశాతం.. తన పెదాలకు పూసుకున్న లిప్ స్టిక్ ముద్దులతో సాక్షాత్కరించినవే.





లిప్ స్టిక్ లెక్స్ ఏ తో చిన్న తరహాలో  సెలబ్రిటీల చిత్రాలను రూపొందించేందుకు ఫ్రేజర్ కు కొన్ని గంటల సమయం పడితే...  పెద్ద తరహా చిత్రాలకు మాత్రం.. రోజుల తరబడి సమయం పడుతుంది. ఒక్కోసారి  ప్రత్యేక చిత్రాలను రూపొందించాలనుకున్నపుడు వారంవరకూ కూడా ఆమె కాన్వాస్ పై ముద్దులు కురిపించాల్సి వస్తుంటుందట. అంతేకాదు అటువంటి పోట్రైట్ల కోసం  కొన్ని ట్యూబ్ ల కొద్దీ లిప్ స్టిక్ వాడాల్సి ఉంటుందని చెప్తోంది. అందుకు అతి పెద్ద నిదర్శనం 2014 లో ఆమె రూపొందించిన మార్లిన్ మాన్రో కాన్వాస్ కళాఖండమే. దీనికోసం ఆమె నాలుగురోజుల సమయాన్ని వెచ్చించడంతోపాటు, రెండు ట్యూబ్ ల లిప్ స్టిక్ ను వాడిందట.





Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top