సెల్ దొంగల్ని పట్టిచ్చే యాప్

సెల్ దొంగల్ని పట్టిచ్చే యాప్ - Sakshi

దొంగను పట్టిచ్చే యాప్ లు వచ్చేశాయి. లుక్ అవుట్ అనే యాప్ సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ల ఫోటోలను, దొంగతనం చేసిన ప్రదేశాన్ని ఫోటో తీసి, యజమానికి ఈ మెయిల్ చేసేస్తుంది. గంటల్లో  దొంగను పట్టేయచ్చు.

 

ఈ లుక్ అవుట్ అనే యాప్ తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా లో ఒక మహిళా దొంగను పట్టేసింది. దొంగ ఓ కారు నుంచి సెల్ ఫోన్ ను తీసుకుంది. కారు యజమాని విండో మూయడం మరిచిపోవడంతో దొంగ పని సులువయింది. అయితే దొంగ ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ప్రయత్నించగానే ఆ యాప్ అలర్ట్ అయిపోయింది. ఆమె ఫోటో తీసేసింది. ఆ తరువాత దొంగతనం చేసిన ప్రదేశం తాలూకు ఫోటోలు తీసింది. ఆ ఏరియా మ్యాప్ ను డౌన్ లోడ్ చేసేసింది. ఇవన్నీ యజమానికి ఈ మెయిల్ రూపంలో వచ్చేశాయి. 

ఆ యజమాని సోషల్ మీడియాలో దొంగ ఫోటో, దొంగిలించిన ప్రదేశం తాలూకు ఫోటోలను అప్ లోడ్ చేసింది. గంటల్లో ఆ వివరాలు వేలాది మంది షేర్ చేశారు. దాంతో దొంగను గుర్తించి పట్టేసుకున్నారు. 

 

ఫోన్ మరిచిపోయే వాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగం. కానీ సెల్ దొంగలకు ఈ యాప్ అంటే బాప్ రే బాప్!!

 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top