రెండు మిలియన్ డాలర్లు పలికిన ఏంజెలీనా ఇల్లు..!

రెండు మిలియన్ డాలర్లు పలికిన ఏంజెలీనా ఇల్లు..!


ప్రఖ్యాత హాలీవుడ్ తార.. ఏంజెలీనా జోలి కు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి బహిర్గతమైంది. ఆమెకే కాదు ఆమెకు  సంబంధించిన ఏ వస్తువుకైనా అంతే గుర్తింపు ఉంటుందన్నిది కూడ రూఢి అయ్యింది. అమ్మకానికి పెట్టిన ఏంజెలీనా చిన్ననాటి నివాసం.. ఇప్పుడు మార్కెట్లో అత్యధిక రేటు పలికి వార్తల్లోకెక్కింది. న్యూయార్క్ దగ్గరలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న  రాక్ ల్యాండ్ కౌంటీ హౌస్.. సుమారు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించినది. ఏంజెలీనాకు పెరిగిన క్రేజ్ లాగే ఆ నిర్మాణానికీ ఇటీవల భారీ క్రేజ్ పెరిగిపోయింది.



గతేడాది అమ్మకానికి పెట్టిన కౌంటీ హౌస్ అప్పట్లో ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 6 కోట్ల 20 లక్షలు  పలుకగా...  కేవలం ఒక్క ఏడాదిలోనే రెట్టింపై ఇప్పుడు రెండు మిలియన్ల డాలర్లకు పైగా.. దాదాపు రూ. 12 కోట్ల 40 లక్షల పై చిలుకు రేటుతో అమ్ముడు పోయింది. 1950 లో నిర్మించిన కౌంటీ హౌస్ ను కండక్టర్ యూజీన్ కోన్ తన స్వంతం చేసుకున్నారు. 1980 సంవత్సరం వరకూ కౌంటీ హౌస్ ఏంజెలినా తల్లి మార్చెలిన్ బెట్రాన్డ్ యాజమాన్యంలో ఉండేది.



మార్చెలిన్ ఆమె భర్త వాయ్ గెట్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఏంజెలీనా తోపాటు ఆమె సోదరుడు జేమ్స్ ను తీసుకొని బెట్రాన్డ్ లాస్ ఏంజెల్స్ కు మకాం మార్చేసింది. అప్పట్లో ఏంజెలీనా  స్నెడెన్స్ ల్యాండింగ్ లోని ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండేది. నాలుగు బెడ్ రూమ్స్ ఉన్నకౌంటీ హౌస్ ను నాలుగువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1950వ దశకంలో నిర్మించారు. ఏంజెలీనా ఇల్లు ఒక్క ఏడాదిలోనే రెట్టింపు రేటు పెరిగిపోయిందంటే ఆమెకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top