అతిపెద్ద విమానయానం సక్సెస్‌

అతిపెద్ద విమానయానం సక్సెస్‌


లండన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన ‘ఎయిర్‌ ల్యాండర్‌–10’ ఇటీవల ప్రయోగాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఈ విమానాన్ని వాణిజ్యపరమైన సేవలకు వాడటానికి మరో ముందడుగు పడింది.


హీలియం వాయువుతో నిండిన ఈ విమానం మానవ సహితంగా అయితే 6,100 మీటర్ల ఎత్తులో ఐదు రోజుల వరకు ఎగరగలదు. విమానాలు, హెలికాప్టర్లు, ఎయిర్‌షిప్‌లలోని సాంకేతికతలను కలగలిపి బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్‌ ఎయిర్‌ వెహికల్స్‌ అనే కంపెనీ దీనిని తయారు చేసింది. 92 మీటర్ల పొడవైన ఈ విమానం ప్రస్తుతం సేవలందిస్తున్న వాటిలోకెల్లా అతి పెద్దది. మే 10న ఎయిర్‌లాండర్‌–10 విమానం 180 నిమిషాలపాటు గాలిలో ఎగురుతుండగా వివిధ అంశాల్లో దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. ప్రయాణికుల విమానాలను కూడా తీసుకొస్తామని సంస్థ అధికారులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top