65 మంది భర్తలకు జైలు శిక్ష
రియాద్: మాజీ భార్యలకు అనుకూలంగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి నిరాకరించిన 65 మంది భర్తలు సౌదీ అరేబియాలో జైలు పాలయ్యారు. ఒక్కొక్కరికి కనిష్టంగా రెండు రోజుల నుంచి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్షను స్థానిక కోర్టులు ఖరారు చేశాయి. మనోవర్తి చెల్లించని వారికి, పిల్లలు వారి తల్లిని కలవకుండా చేసిన వారికి ఈ శిక్షలు వేశాయి.