ఇండోనేసియాలో భూకంపం


జకార్తా: ఇండోనేసియా పశ్చిమ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదు అయిందని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ గురువారం వెల్లడించింది. జకార్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని తూర్పు మలుకు ప్రావెన్స్లోని హల్మహెర బరత్ వద్ద ఈ భూకంపం ఏర్పడిందని తెలిపింది.


కాగా భూకంపం వల్ల సునామీ వచ్చి సూచనలు ఏమీ లేవని పేర్కొంది. ఈ భూకంపం బుధవారం రాత్రి వచ్చిందని తెలిపింది.  అయితే ఈ భూకంపం కారణంగా ఎక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం కాని జరిగినట్లు సమాచారం లేదని మెట్రోలాజికల్ అండ్ జియో ఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top