టీచర్లను పొడిచేందుకు కత్తి తీసుకెళ్లిన బుడ్డోడు!

టీచర్లను పొడిచేందుకు కత్తి తీసుకెళ్లిన బుడ్డోడు! - Sakshi


వాడి వయసు నిండా చూస్తే.. ఐదేళ్లు. స్కూల్లో ఉన్న చెడ్డ టీచర్లను పొడిచేస్తానంటూ ఇంట్లోంచి ఓ చాకును స్కూలుకు తీసుకెళ్లాడు! ఈ సంఘటన ఇంగ్లండ్లో జరిగింది. తన తోటి పిల్లలతో ఇలా కత్తి తెచ్చానని, టీచర్లను పొడిచేస్తానని చెబుతుండగా విన్న సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు. దాంతో వారం రోజుల పాటు అతడిని పార్టింగ్టన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూలు నుంచి బహిష్కరించారు.



పిల్లల మీద గానీ, తమ మీద గానీ దాడి జరుగుతుందన్న భయంతోనే తామిలా చేశామని పాఠశాల వర్గాలు చెప్పడంతో మిగిలిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి సంఘటనలు అమెరికాలోని హైస్కూళ్లలో జరుగుతాయి తప్ప, ఇలాంటి ప్రైమరీ స్కూళ్లలో జరగకూడదని ఓ తండ్రి అన్నారు. సిబ్బంది ఆ కత్తిని స్వాధీనం చేసుకునే లోపే.. అతడు ఇద్దరు క్లాస్మేట్లకు ఆ కత్తిని చూపించాడు. పిల్లాడు నేరుగా సిబ్బందిని బెదిరించకపోయినా.. స్కూలు గేటువద్దే దీని గురించిన చర్చ జరిగిందని అంటున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top