సెటిల్‌మెంట్లకు వేదికగా కేబినెట్ మీటింగ్

సెటిల్‌మెంట్లకు వేదికగా కేబినెట్ మీటింగ్ - Sakshi


- భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు

- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం  



 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ‘మీకెంత.. మీకెంత’ అని వాటాలు పంచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర స్థారుులో ధ్వజమెత్తారు. గురువారం తాత్కాలిక రాజధానిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్‌ని.. సెటిల్‌మెంట్లకు వేదికగా మార్చారని విమర్శించారు. కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గడికోట విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లపై చర్యలు తీసుకోకుండా టీడీపీ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకోవాల్సిన కేబినెట్‌లో వారి తరపున ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. కనీసం నోట్ల రద్దుపైన కూడా చర్చే జరగలేదన్నారు. కేబినెట్‌లో ఆమోదం తెలిపిన 12 అంశాలలో ఏడు అంశాలు భూ కేటారుుంపులేనని తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో భూ కేటారుుంపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.



 మీ అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధికి అడ్డుపడ్డట్టా..?

 పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని గడికోట స్పష్టం చేశారు. టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విశాఖలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన సదస్సుతో ఎంత వరకు పెట్టుబడులు రాబట్టారని నిలదీశారు.



 ప్రజల కష్టాలు పట్టడం లేదు: రాష్ట్రంలో రైతుల కష్టాలు ఈ సర్కారుకు పట్టడం లేదని, రబీ గురించి అసలు ఆలోచించడం లేదని గడికోట మండిపడ్డారు. బ్యాంకుల నుంచి రుణాలు దొరక్క.. రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రరుుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారుల వద్ద డబ్బు లేదని, బ్యాంకుల్లో ఖజానా ఖాళీ అరుు్యందన్నారు. ఇవి చాలవన్నట్లు మహిళల్లో కొత్త అనుమానాలు పుట్టించారని, ఉన్న బంగారాన్ని లాగేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top