Alexa
YSR
‘పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఈ తృప్తి చాలు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ

భార్యను దూరం చేశారని..

Sakshi | Updated: April 21, 2017 12:43 (IST)

హైదరాబాద్‌: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తన నుంచి దూరం చేశారనే మనోవేదనతో ఓ యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కర్మన్‌ఘాట్‌ నిర్మలనగర్‌ కాలనీలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మహేందర్‌ రెడ్డి అనే యువకుడు ఇటీవల ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.

ఆమెను మహేందర్‌రెడ్డి నుంచి దూరం చేయడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

కోటలో వేటగాడు!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC