లాక్మే బ్యూటీ విన్నర్

లాక్మే బ్యూటీ విన్నర్


మార్చి 8న వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా ప్రతి ఏడాదిలాగే.. లాక్మే సెలూన్ 8 మంది వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీరికి రాబోయే ఎనిమిదేళ్లు బ్యూటీ సర్వీసెస్ ఫ్రీగా అందించనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 మంది మహిళల్లో హైదరాబాద్‌కు చెందిన సంజనా బిస్వాస్ కూడా ఉన్నారు.

 

 బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని లాక్మే షోరూమ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ నటి అస్మిత సూద్ పాల్గొని.. సంజనా బిశ్వాస్‌కు ‘లాక్మే ఫర్ లైఫ్’ కార్డ్‌ను అందజేశారు. హిమాయత్‌నగ ర్‌లోని లాక్మే బ్యూటీ స్పాట్‌కు తాను రెగ్యులర్‌గా వెళ్తుంటానని చెప్పారు అస్మిత సూద్. ‘అక్కడ ఎన్నెన్నో కొత్త హెయిర్ స్టయిల్స్, స్కిన్ ట్రెండ్స్ సర్వీసెస్ చే యించుకుంటాను. ఒక మహిళగా ఈ బ్యూటీ ఫీల్డ్‌లో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంద’ని అన్నారు.

 

 థ్రిల్‌గా ఫీలవుతున్నా..

 లాక్మే లైఫ్ కార్డ్‌ను అందుకోవడం హ్యాపీగా ఉందన్నారు లాక్మే లక్కీ విన్నర్ సంజనా బిశ్వాస్. ‘మేము హైటెక్ సిటీలో ఉంటాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఏడేళ్లుగా లాక్మే సెలూన్‌కే వెళ్తున్నాను. నా వెడ్డింగ్ ఫిక్స్ అయినప్పటి నుంచి ప్రీ వెడ్డింగ్ , పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు లాక్మేలోనే ముస్తాబయ్యాను. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 మంది మగువల్లో నేనుండటం అదృష్టంగా భావిస్తున్నాను. రానున్న 8 ఏళ్లు బ్యూటీ సర్వీసెస్ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేనందుకు చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాను’ అని సంతోషంగా తెలిపారు సంజ నా బిశ్వాస్.

 సిరి

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top