అప్పు తీర్చలేదని.. ఆలిని ఎత్తుకెళ్లారు

నిందితులు ఉపయోగించిన కారు - Sakshi


భర్త లేని సమయంలో భార్య కిడ్నాప్‌

- పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు



హైదరాబాద్‌: అప్పు తీర్చలేదని ఆలిని ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు 12 గంట ల్లోనే కిడ్నాపర్లను అరెస్టు చేసి మహిళను విడిపించారు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌ అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఏపీ ఆనంద్‌కుమార్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. భీమవరానికి చెందిన టి.శ్రీనివాస్‌.. భార్య నాగమణితో కలసి డీడీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా కుదిరాడు. దిల్‌సుఖ్‌నగర్‌ వాసి వాచ్‌మన్‌ శ్రీనివాస్‌ వద్ద నాలుగేళ్ల క్రితం రూ. 4లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. అప్పట్నుంచి వడ్డీ కడుతూ.. అసలులో ఒక లక్ష కూడా చెల్లించాడు. మిగతా మొత్తం చెల్లించాలంటూ కొంతకాలంగా శ్రీనివాస్‌పై ఒత్తిడి తెస్తున్నాడు.



ఒత్తిడి తట్టుకోలేక అతను వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఇది భరించలేని శ్రీని వాస్‌ నలుగురు స్నేహితులతో కలసి సోమవారం టి. శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నాగమణితో గొడవ పడటమేగాక  శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి నీ భార్యను తీసుకె ళ్తున్నాం.. డబ్బు ఇచ్చి విడిపించుకో అంటూ హెచ్చరిం చారు. కళ్లముందే కన్నతల్లిని కారులో ఎత్తుకెళ్లడంతో నాగమణి కుమారుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆనంద్‌కుమార్‌ వెంటనే మూడు ప్రత్యేక బృందాల సాయంతో బాలుడు చెప్పిన కారు ఆధారాలతో పాటు సీసీ ఫుటేజీని పరిశీలించి కేసు దర్యాప్తు చేశారు. కారు నిజామాబాద్‌కి వెళ్లినట్లు తేలడంతో మంగళవారం పోలీ సులు అక్కడికి వెళ్లి మహిళను, కిడ్నాపర్లను అంబర్‌ పేటకు తీసుకువచ్చారు. మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. శ్రీనివాస్‌కు సహకరించిన మరో ఐదుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top