హైదరాబాద్ అంటే దానికి ఫేమస్

హైదరాబాద్ అంటే దానికి ఫేమస్


హైదరాబాద్ అంటే ఇరానీ ఛాయ్‌కి ఫేమస్ అని చాలా మందికి తెలుసు. కానీ అర బిక్ ఘావా అనే మరో రకం ‘టీ’కి కూడా మనం కేరాఫ్ అడ్రస్ అని ఎంత మందికి తెలుసు. అలాగే పౌనా, సులేమాన్ ఛాయ్, కేశర్.. ఇలా చలికాలంలో సిటీలో ప్రత్యేకంగా లభించే ‘టీ’ వెరైటీలు చాలా తక్కువ మందికే తెలుసు. విభిన్న దేశాలు, సంప్రదాయాలతో మమేకమై ఎన్నో అభి‘రుచుల’ను తనలో ఇముడ్చుకున్న మన సిటీ హిస్టారికల్ ‘టీ’లకు కేంద్రమైంది.

 - ఎస్.సత్యబాబు

 

కేశర్.. రిచ్ ఫ్లేవర్  ఇది కొంచెం ఖరీదైన టీ. కుంకుమ పువ్వును  వినియోగించి ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారు చేస్తారు. గతంలో సంపన్నుల ఇళ్లకు మాత్రమే పరిమితమైనా ఇప్పుడు పాతబస్తీ ఫేవరెట్. నగరంలోని కొన్ని హోటళ్లలో మాత్రమే లభిస్తుంది. జలుబు నివారణకు ఇది ఉపకరిస్తుంది. దీనిని చిన్న పిల్లలు, మహిళలకు విక్రయించరు. ధర రూ.20 నుంచి రూ.45

 

సులేమానీ.. ఫ్యాట్ పరారీ...

ఇది చాపత్తాతో తయారవుతుంది. లెమన్, పుదీనా, మసాలా రుచుల్లో లభ్యమవుతుంది. ఏ కాలంలోనైనా అన్ని వయసుల వారు తాగేందుకు అనువైన పానీయం. సిటీలో లెమన్, పుదీనా సులేమానీల వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. దీన్ని తాగడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు కొవ్వు కరిగిస్తుందని చెబుతున్నారు అమ్మకందారులు. సులేమానీని విక్రయించేందుకు పాతబస్తీలో ప్రత్యేక దుకాణాలున్నాయి. ఇది సౌదీ నుంచి నగరానికి వచ్చింది. ధర రూ.8 నుంచి రూ.20

 

చలికాలం.. ఛాయ్ కాలం..

వినూత్న రుచితో పాటు వైద్య పరమైన విలువలు కూడా ఉండడం చలికాలం ఛాయ్‌ల పాపులారిటీని ఇనుమడింపజేస్తూ హాట్‌హాట్‌గా అమ్ముడయ్యేలా చేస్తోంది. అరబ్ దేశస్తుల మూలాలు ఎక్కువగా కనిపించే బార్కాస్‌లో ఈ వింటర్ టీలు బాగా పాపులర్. ఈ సీజన్‌లో బార్కాస్‌లో పెద్ద సంఖ్యలో షాప్‌లు నెలకొల్పి ఈ వేడి వేడి  హిస్టారికల్ టీలను అందిస్తారు.

 

పౌనా.. లేడీస్ స్పెషల్

దీని రుచి లైట్‌గా ఉంటుంది. తయారీలో పాలమీగడను వినియోగిస్తారు. ఇందులో డికాక్షన్ తక్కువ, పాల మోతాదు ఎక్కువ. తక్షణ శక్తినివ్వడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది మహిళలకు ప్రత్యేకం. యువతులు బాగా మక్కువ చూపే పానీయం ఇది.

 ధర రూ.20 నుంచి రూ.30

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top