ఈ ప్రేమ.. ‘చిరంజీవి’!

ఈ  ప్రేమ.. ‘చిరంజీవి’!


గాజులరామారం: ఆ ప్రేమ... ఫేస్‌బుక్‌లోంచి పుట్టలేదు. గుండె లోతుల్లోంచి జనించింది. సినిమాలు, షికార్లతో వారి ప్రేమాయణం సాగలేదు. కష్టాలూ.. కన్నీళ్లతో నడిచింది. కన్నవారు కాదన్నా...అయిన వారు అక్కున చేర్చుకోకపోయినా... ‘ప్రేమ’ వారికి అండగా నిలిచింది. ప్రేమనే నమ్ముకున్నారు... నిలబెట్టుకున్నారు... ఇంకా చెప్పాలంటే ‘బతికించుకున్నారు’. తాను ప్రేమించిన వ్యక్తి దాదాపు మరణంతో పోరాడుతున్న వేళ.. తన ప్రేమతో ఆయనకు ఊపిరిగా నిలిచిందా ప్రేమికురాలు.



మనోధైర్యం... ధృఢ సంకల్పంతో ప్రియుడి ప్రాణాలు నిలబెట్టింది. తమ ప్రేమకు చిహ్నంగా కలిగిన ఇద్దరు పిల్లల తో... తాము నిర్మించుకున్న ప్రేమ సామ్రాజ్యంలో ఆనందంగా గడుపుతున్న ప్రేమ జంటపై... ‘ప్రేమికుల దినోత్సవం’ సంద ర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

 

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే... వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి చిరంజీవి ఎక్జిక్యూటివ్‌గా, నగరంలోని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి రిసెప్షనిస్ట్‌గా ఒకే సంస్థలో పని చేస్తుండేవారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు ఈ ప్రేమను అంగీకరించలేదు. విజయలక్ష్మి తన ఇంట్లో ఒప్పించినా.. చిరంజీవి ఇంట్లో మాత్రం తిరస్కరణ ఎదురైంది. ఈ తరుణంలోనే చిరంజీవి కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నట్లు తెలి సింది. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనట్టు డాక్టర్లు చెప్పా రు. ఇరువురి కుటుంబాల నుంచి సహకారం అందలేదు. అయినా విజయలక్ష్మి వెనకడుగు వేయలేదు. ప్రేమిం చిన వాడితోనే జీవితం అనుకుంది. 2008లో చిరంజీవిని పెళ్లి చేసుకుంది.

 

ఆపరేషన్ చేయాలి కానీ...

ఈ తరుణంలో చిరంజీవికి కచ్చితంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాం టేషన్ చేయాల్సిందేనని డాక్టర్లు చెప్పారు. మారు ఆలోచించకుండా విజయలక్ష్మి తన కిడ్నీ ఇచ్చేందుకు ముం దుకు వచ్చింది. ‘ఎంత లేదన్నా రూ.10 లక్షలు ఖర్చవుతుంది. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెచ్చేది?’ అని అయిన వారంతా వారించారు. కిడ్నీ ఇచ్చినా పూర్తి గా నయం కాకపోవచ్చని నిరాశపరిచారు.‘కొత్తగా మీకు పెళ్లయింది కదా? మీ కిడ్నీ ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయి’ అంటూ డాక్టర్లూ సందేహించారు.



కేవలం కిడ్నీ కొసమే చిరంజీవి పెళ్లి చేసుకుని ఉంటాడనేది దానికి కారణం. కానీ లక్ష్మి ఇవేమీ పట్టించుకోలేదు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా రక్త పరీక్ష చేయించుకుంది. ఇద్దరిదీ ఒకటే గ్రూపు కావడంతో తన కిడ్నీని చిరంజీవికి ఇవ్వడానికి సిద్ధమైపోయింది.

 

‘సాక్షి’ ఎంట్రీతో...

వీరి విషాద గాథపై 2010లో ‘సాక్షి’ దినపత్రికలో కథ నం... ‘సాక్షి’ టీవీలో లైవ్ కవరేజీ రావడంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దాతలు విరివిగా సాయం అందించారు. డాక్టర్లు కూడా వెంటనే స్పందించారు. విజయలక్ష్మి కిడ్నీలలో ఒకదానిని చిరంజీవికి అమర్చారు. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు.

 

ప్రస్తుతం సంతోషంగా....

‘సాక్షి’లో కథనం రావడం... దాతలు స్పందిం చడం... ఆపరేషన్ చేయడం... అన్నీ చకచకా జరిగిపోయాయి. దాతలద్వారా వచ్చిన రూ.30 లక్షలలో ఖర్చులు పోనూ మిగిలిన మొత్తంతో శ్రీరాంనగర్‌లో సొంత ఇల్లు కట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి రోడమేస్త్రీ నగర్‌లో స్టేషనరీ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

 

ఇష్టపడితే కష్టమైనా సంతోషమే

నిజమైన ప్రేమ ఉంటే ఎంతటి కష్టాన్నయినా సంతోషంగా ఎదుర్కోవచ్చు. మాలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచింది. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ‘సాక్షి’ సిబ్బంది చేసిన సాయం మరువలేనిది. సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చేయూత.. వారి అబ్బాయి, హీరో అల్లరి నరేష్ అండదండలు మనోైధె ర్యాన్నిచ్చాయి. మాకు ఇద్దరు పిల్లలు క్రిష్ విజయ్, స్ఫూర్తి హెతిబా. చిన్నారులతో ఆనందంగా గడుతున్నాం.

 - విజయలక్ష్మి దంపతులు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top