2019 ఎన్నికల్లో కెప్టెన్‌ ఉత్తమే

2019 ఎన్నికల్లో కెప్టెన్‌ ఉత్తమే - Sakshi


ఆయన నిర్ణయమే ఫైనల్‌: కుంతియా

పార్టీలో ఎవరినీ విస్మరించం

కట్టు తప్పితే ఎంతవారైనా వేటు తప్పదు

ఒకట్రెండు నెలల్లో పార్టీలో భారీ మార్పులు  


సాక్షి, హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోనే ముందుకె ళ్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఆయన నిర్ణ యమే అంతిమమని తేల్చి చెప్పారు. ఎన్నికల దాకా మార్పులేమీ ఉండబోవని, పార్టీ ఇన్‌ చార్జిగా తాను, టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌కుమారే ఉంటారన్నారు.



సోమవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో కుంతియా మాట్లాడుతూ పార్టీలో ఎవరినీ విస్మరించబో మని, అందరూ కలసి పనిచేసేలా చొరవ తీసు కుంటానన్నారు. ఉత్తమ్‌ పని తీరుపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహల్‌గాంధీ, అధిష్టానం సంతృప్తిగా ఉందన్నారు. పార్టీలోని ఏ స్థాయి నాయకుడైనా క్రమశిక్షణకు లోబడి పని చేయా లని, క్రమశిక్షణను ఉల్లంఘించి కట్టుతప్పితే ఎంత పెద్ద నాయకుడి విషయంలోనైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పార్టీ గెలుపు, బలోపేతం కోసం ఎవరికీ భయపడేది లేద న్నారు. ఒకట్రెండు నెలల్లో భారీ మార్పులుం టాయన్నారు. పార్టీ బలోపేతం కోసం కొన్ని కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.



కేసీఆర్‌ కుటుంబమే లాభపడుతోంది

తెలంగాణ ఎందుకు ఇచ్చామో, మూడేళ్ల టీఆర్‌ ఎస్‌ పాలనలో ఆకాంక్షలు ఎంత వరకు నెరవే రాయో ప్రజలకు అర్థమవుతోందని కుంతియా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప తెలంగాణ కోసం ఉద్యమిం చిన వర్గాలు, ప్రజలకు రాష్ట్రంలో ప్రయోజనం కలగడం లేదని ఆయన విమర్శించారు. తమ పోరాటం వ్యక్తులపై కాదని, విధానాలు, ప్రజాసమస్యలపైనేనన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ ఓటమికి రాహుల్‌ గాంధీని తప్పు బడుతున్నారని, మరి గెలిచిన రాష్ట్రాల్లో ఘనత ఎవరిదో కూడా చెప్పాలన్నారు.



 వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండాలా లేదా అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, ఇప్పటిదాకా పొత్తుల గురించి చర్చ జరగలేదని, టీపీసీసీ కూడా ప్రతిపా దనలు పంపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీ సం ఆరు నెలలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని కుంతియా వెల్లడించారు. టీపీసీసీ సమన్వయ కమిటీని కుదిస్తామని కుంతియా చెప్పారు. తమ పార్టీపై తెలం గాణ ప్రజలకు విశ్వాసముందని, సంగా రెడ్డిలో జరిగిన బహిరంగ సభ విజయ వంతం కావడమే దీనికి నిదర్శనమన్నారు. తెలంగాణలోని ప్రతి మండలానికీ వెళ్లి అన్ని స్థాయిల్లోని నేతల మధ్య విబేధాలను పరిష్క రిస్తామన్నారు. రాహుల్‌ సందేశ్‌ యాత్రలను ఎన్నికల దాకా కొనసాగి స్తామని కుంతియా చెప్పారు.



అధికారమే లక్ష్యంగా పని చేయండి

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అను బంధ సంఘాలు పనిచేయాలని కుంతియా కోరారు. సోమవారం గాంధీ భవన్‌లో యువజన, మహిళా కాంగ్రెస్‌ సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, పార్టీ ఇన్‌చార్జి కార్యదర్శి సతీశ్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా కుంతియా మాట్లాడుతూ విద్యా ర్థులు, యువజనులు ఉద్యమించడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ఇప్పుడు వారినే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.



విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ చేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసగిస్తోందని మండిపడ్డారు. వాటి కోసం యువత పెద్ద ఎత్తున ఉద్యమించాలని, ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్‌ కార్యవర్గాలను ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడాలని కుంతియా పిలుపునిచ్చారు. సమావేశంలో సేవాదళ్‌ చైర్మన్‌ కె.జనార్దన్‌రెడ్డి, ఓబీసీ సెల్‌ చైర్మన్‌ చిత్తరంజన్‌దాస్, లీగల్‌ సెల్‌ చైర్మన్‌ దామోద ర్‌రెడ్డి, మైనారిటీ సెల్‌ చైర్మన్‌ ఫక్రుద్దీన్, కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, ఎస్టీ సెల్‌ చైర్మన్‌ జగన్‌లాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అనుబంధ సంఘాల ఇన్‌చార్జి  మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరు కావడంపై పలువురు నేతలు చర్చించుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top