మత చిచ్చు పెట్టడానికే అమిత్‌షా పర్యటన

మత చిచ్చు పెట్టడానికే అమిత్‌షా పర్యటన - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: సామరస్యంతో ఉన్న రాష్ట్రంలో మతచిచ్చు పెట్టడానికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ మూడేళ్లలో తెలంగాణ ప్రజల కష్టాలను పట్టించుకోని బీజేపీ నాయకులు, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం పర్యటనలు చేస్తున్నా రన్నారు. బీజేపీ చేసిన మోసాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.



అవి తెలంగాణ హక్కు..

విభజన బిల్లులో పెట్టిన ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్ర మ, హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన, గిరిజన వర్సిటీ వంటి హామీలన్నీ తెలం గాణ ప్రజల హక్కు అని ఉత్తమ్‌ అన్నారు. వీటిని అమలుచేయకపోగా.. కనీసం పట్టిం చుకోలేదన్నారు. ప్రజలను మోసం చేసినం దుకు ముందుగా అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని, ఆ తరువాతే రాష్ట్రంలో పర్యటిం చాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లా లో రజాకార్లు దాడులు చేసిన గ్రామాలలో షా సమావేశాలు పెడుతున్నారని, మత తత్వాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడానికే ఇటువంటి కుట్రలకు దిగుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలను సాగనివ్వబోమని, ఇక్కడ ప్రజలు హిందూ, ముస్లిం అనే బేధాల్లే కుండా సామరస్యంతో కలసి ఉంటు న్నారని చెప్పారు. బ్రహ్మాండంగా ఉన్న సచివాలయ భవనాలను కాదని కొత్త సచివాలయం పేరుతో సీఎం కేసీఆర్‌ చేస్తున్న డ్రామాలకు కేంద్రం సహక రిస్తున్నదని ఆరోపించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top