ఆత్మ ప్రబోధంతో ఓటేయండి

ఆత్మ ప్రబోధంతో ఓటేయండి - Sakshi


► రాష్ట్రపతి ఎన్నికలపై ఉత్తమ్‌

► తెలంగాణ ఇచ్చిన వారినే ఎన్నుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి




సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి లోక్‌సభలో స్పీకర్‌గా ఎంతో కృషిచేసిన యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సహా ఎమ్మెల్యేలంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవితో కలసి గాంధీ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ, మీరాకుమార్‌ పట్టుదల, శ్రమను ప్రజలు మరిచిపోరన్నారు.


తెలంగాణ బిల్లు ను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు అడ్డుపడ్డా.. స్పీకర్‌గా మీరాకుమార్‌ కొన్ని కఠిన నిర్ణయా లు తీసుకున్నారని ఉత్తమ్‌ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేయడానికి మీరాకు మార్‌ చేసిన కృషి అందరికీ తెలుసన్నారు. లౌకిక, ప్రజాస్వామిక, రాజ్యాంగస్ఫూర్తికి ఆమె నిలువెత్తు రూపమన్నారు. బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ దళితులకు, క్రిస్టియన్లకు వ్యతిరేకమని.. ముస్లింలకు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ రంగానాథ్‌ మిశ్రా సిఫార్సులకు బీజేపీ అధికార ప్రతినిధిగా 2010 మార్చిలో ఆయన వ్యతిరేకంగా మాట్లా డారని చెప్పారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వడాన్ని కూడా రామ్‌నాథ్‌ వ్యతిరే కించారని, అలాంటి వ్యక్తికి సీఎం కేసీఆర్‌ మద్దతు ఇస్తారా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.



కేసీఆర్‌ చరిత్ర హీనుడవుతాడు

తెలంగాణ బిల్లు ఆమోదించే సమయంలో పెప్పర్‌ స్ప్రేతో స్పీకర్‌గా ఇబ్బందులు ఎదు ర్కొన్న మీరాకుమార్‌ ఓటేయకుంటే కేసీఆర్‌ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని శాసనమం డలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ హెచ్చరిం చారు. తెలంగాణ ఇచ్చిన వారికి రుణం తీర్చుకోవడానికి టీఆర్‌ఎస్‌కు ఇది మంచి అవకాశమన్నారు.


విభజన బిల్లులోని హామీల ను కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్న బీజేపీకి, ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించేందుకు ఎందుకు తొందరపడుతు న్నారని ప్రశ్నించారు. వెంటనే కేసీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని, మీరాకుమార్‌కు మద్దతివ్వాలన్నారు. ఎన్డీయేకు మద్దతు ప్రక టించడం ద్వారా టీఆర్‌ఎస్, కేసీఆర్‌ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ తానులోని ముక్కలేనని బయట పడిందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేవలం సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యుల నియోజక వర్గాల్లోనే అవుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను అభినం దిస్తున్నట్లు చెప్పారు.



రాజ్యాంగ స్ఫూర్తికి మీరాకుమార్‌ ప్రతీక: జైపాల్‌రెడ్డి

రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీక లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అని కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ అజ్ఞాత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో విద్య నేర్చుకున్న వ్యక్తిని రాష్ట్రపతి చేయాలనుకోవడం అజ్ఞానం, ప్రమాద కరమని హెచ్చరించారు. రాష్ట్రపతిగా మీరాకుమార్‌కి ఉన్న అర్హతలు మరెవరికీ లేవన్నారు. ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియకముందే మద్దతు ప్రకటించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ అనుకూల భావాలున్నాయని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలతో సీఎం కేసీఆర్‌ అసలు రంగు బయటపడిందన్నారు.  


జిల్లా కేంద్రాల్లో రాహుల్‌ సందేశ్‌ సభలు: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ ప్రసం గాన్ని, కాంగ్రెస్‌ హామీలను, టీఆర్‌ఎస్‌ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు పోవడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో రాహుల్‌ సందేశ్‌ యాత్ర పేరిట సభలను నిర్వహిస్తా మని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు.


గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలం గాణలో  పరిణామాలపై రాహుల్‌ చేసిన ప్రసంగానికి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చిందన్నారు. కేవలం నలుగురు కుటుం బసభ్యులకే తెలంగాణలోని వనరులన్నీ దక్కుతున్నాయని, మంత్రులతో సహా టీఆర్‌ఎస్‌ నేతలంతా డమ్మీలుగానే మిగిలి పోయారన్నారు. రైతులకు రుణమాఫీ, మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీ లు వేయడం, నిరుద్యోగులపై నిర్లక్ష్యం లాంటివన్నీ టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఉరితాళ్ల వుతాయన్నారు. రంజాన్‌ సం దర్భంగా పేద ముస్లింలకు ఆదివారం సరుకులు పంపిణీ చేస్తామని, మియాపూర్‌ భూములపై విచారణ చేపట్టాలంటూ.. ఈ నెల 28న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్‌ చెప్పారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top