రుణమాఫీపై మాట తప్పిన కేసీఆర్

రుణమాఫీపై మాట తప్పిన కేసీఆర్ - Sakshi


రైతులను మోసం చేసిన ప్రభుత్వంపై ఉద్యమించాలి: ఉత్తమ్

సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ చేయకపో వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రుణమాఫీకి నిధులను విడుదల చేయకుండా రూ.150 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గడీని కట్టుకున్నారన్నారు. ఎఫ్‌ఆర్ బీఎం పరిమితిని పెంచితే రుణమాఫీ ఒకేసారి చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... మాట తప్పారన్నారు. రైతులను మోసం చేసిన సీఎం, ప్రభుత్వంపై పెద్దఎత్తున ఉద్యమిం చాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపుని చ్చారు. రైతులను ఈ ఉద్యమాల్లో భాగస్వా మ్యం చేసేలా పనిచేయాలన్నారు. కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల నేతలతో గాంధీభవన్ లో మంగళవారం ఆయన సమావేశమయ్యా రు.


రైతు రుణమాఫీ దరఖాస్తులు, ఫీజు రీరుుంబర్సుమెంటు దరఖాస్తులు, ఈ నెల 9న నిర్వహించనున్న కాం గ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కృతజ్ఞతా దినోత్సవ ఏర్పాట్లు వంటివాటిపై ఈ సమావేశంలో సమీక్షించారు. ఫీజు రీరుుం బర్సుమెంటు చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయని ఉత్తమ్ అన్నారు. ఈ క్రమంలో విద్యార్థి ఉద్యమాలను పెద్దఎత్తున చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించుకోవాల్సి ఉం దని, వాటికి గురువారం లోగా సూచనలు, సలహాలు, దరఖాస్తులు చేసుకోవాలన్నారు.




జయలలిత మృతికి సంతాపం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలిత మృతికి ఉత్తమ్ సంతాపం ప్రకటిం చారు. తమిళ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాలపైనా ఆమె చెరగని ముద్ర వేశారన్నారు. సామాన్యుల కోసం గొప్ప పథకాలను అమలుచేసిన మహనీ యురాలని, ఆమె మృతి తీరని లోటని ఉత్తమ్ అన్నారు.  

 

పొంగులేటి గైర్హాజరు

ఈ సమీక్షా సమావేశానికి శాసనమం డలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో పార్టీ నియామకాలు ఏకపక్షంగా ఉన్నాయని, రాష్ట్ర స్థారుు నాయకత్వంలో ఉన్నవారు పార్టీని ఏకపక్షంగా నడిపిస్తున్నారనే అసం తృప్తితో ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా తెలిసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top