‘మత’ రిజర్వేషన్లకు మద్దతివ్వం

‘మత’ రిజర్వేషన్లకు మద్దతివ్వం - Sakshi


బీసీ ప్రతినిధుల సభలో కేంద్ర మంత్రి వెంకయ్య



సాక్షి, హైదరాబాద్‌: ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. దానికి మేము మద్దతివ్వం. ఆర్థికంగా వెనుకబ డిన వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేం దుకు మాత్రమే రిజర్వేషన్లను ఉపయోగించుకో వాలి. ప్రభుత్వాలు ఆ మేరకు చర్యలు తీసుకో వాలి’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో జరిగిన బీసీ ప్రతిని ధుల మహాసభలో ఆయన మాట్లాడారు. ‘పేద కులాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ  సహ కరిస్తుంది. మతపరమైన రిజర్వేషన్లతో ఇతర కులాలు నష్టపోతాయి. కాంగ్రెస్‌ బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసింది.



ప్రధాని మోదీ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల మాదిరిగా సర్వాధికారాలను సొంతం చేసుకుం ది. అరవై సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనలో బీసీలకు రాజ్యాధికారం లేకుండా పోయింది. కానీ, బీజేపీ హయాంలో బీసీ నేత ప్రధానిగా ఉన్నారు’ అని వెంకయ్య చెప్పారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగా ల్లో సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు.



అవి రాష్ట్ర ప్రభుత్వ కమిషన్‌లు...

రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బీసీ కమిషన్‌లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే విషయాలనే నివేదిక రూపంలో ఇస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా నివేదికలు ఇచ్చి వాటిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ‘రాష్ట్ర బీసీ కమిషన్‌ ఆగమేఘాల మీద ఒక్క ముస్లింల రిజర్వేషన్లపైనే ప్రభుత్వానికి నివేదిక ఎలా ఇస్తుంది. బీసీల్లో ఉన్న అన్ని కులాలపై అధ్యయనంచేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. ఆమేరకు చర్చించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచడంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ఈ రిజర్వేషన్ల ను పార్లమెంటు ఆమోదిస్తేనే అమలు సాధ్యమ వుతుంది.’ అన్నారు.



శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీల్లో కొత్త కులాలు పుట్టుకొస్తున్నాయని, ఇటీవల భూపా లపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో రాజన్న కులం పేరు విన్నానన్నారు. సమగ్ర అధ్యయనం చేసి బీసీల స్థితిగతులను పరిశీలిం చాలని సూచించారు. ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా లభించడంతో బీసీలపై జరిగే అక్రమాలు, అన్యాయాలను పరిశీలించి చర్యలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి నందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయలను సన్మానించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీసీ సంఘ నేతలు సత్యనారాయణ, గొరిగె మల్లేశ్‌ యాదవ్, కృష్ణ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top