టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విఫలం

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విఫలం - Sakshi


సామాజిక న్యాయం కొరవడింది: కె.లక్ష్మణ్‌



సాక్షి, హైదరాబాద్‌: మూడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సామాజికన్యా యం కొరవడిందని, రోజురోజుకు నియంతృ త్వ పోకడలు పెరుగుతున్నాయని ధ్వజమె త్తారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని మొత్తం 250 వెనుకబడిన జిల్లాల్లో నల్లగొండ అత్యంత వెనుకబడిన జిల్లా కావడం, ఇక్కడ పేదరికం, సాగు, తాగునీటి సమస్య, ఫ్లోరైడ్‌ సమస్య, ఎస్టీల్లో కడు పేదరికం, తండాల్లో పిల్లల అమ్మకం, నిరుద్యోగం వంటివి తీవ్రంగా ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలో నల్లగొండ జిల్లా దైన్యాన్ని, వెనుకబాటుతనాన్ని కథలు కథలుగా వివరించిన టీఆర్‌ఎస్, అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో ప్రధానమైన సమస్యలను విస్మరించిందన్నారు. అమిత్‌ షా పర్యటన సందర్భంగా ఈ అంశాన్నింటిన్నీ ఆయన దృష్టికి తీసుకెళతామన్నారు.



చరిత్రాత్మక పర్యటన...

అత్యంత వెనుకబడిన జిల్లాకు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు రావడం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని లక్ష్మణ్‌ అన్నారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో సమస్యల అధ్యయనం, దళితులతో సహపంక్తి భోజనాలు, కేంద్ర పథ కాల పరిశీలన వంటివి అమిత్‌షా చేపడతా రన్నారు. ఉద్యమ శక్తుల్లోని నిరాశా నిçస్పృ హలను తొలగించేందుకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ప్రజాస్వా మ్యం, సామాజిక తెలంగాణ సాధనకు ఇది దోహదపడుతుందన్నారు. నల్లగొండ జిల్లా లోని చౌటుప్పల్‌ ఫ్లోరైడ్‌ రిసెర్చ్‌ సెంటర్, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు, దామరచెర్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకోసం 10 వేల ఎకరాల అటవీభూమికి అత్యంత వేగంగా అనుమతి, ఏఐఐఎంఎస్‌ ఏర్పాటునకు రూ.వందల కోట్ల కేటాయింపు వంటివి కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. పార్టీ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా సమాజంలోని చిట్టచివరి పేద వారికి అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈ పర్యటన జరుగుతోందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top