ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ డైవర్షన్స్


హైదరాబాద్ : ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన సీవరేజ్ పైప్‌లైన్ మరమ్మతుల నిమిత్తం ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు.

- తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్‌మీనార్‌ల వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు అనుమతించరు.

- ఈ మార్గంలో రాకపోకలు సాగించే సాధారణ ట్రాఫిక్‌ను సైతం కుడి వైపు ఉన్న రోడ్ మీదుగానే పంపిస్తారు.

- రవీంద్రభారతి వైపు నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా మళ్లిస్తారు.

- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు సచివాలయాలకూ తెలుగుతల్లి చౌరస్తా నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top