చైతన్య దీప్తులు

చైతన్య దీప్తులు


సాయుధపోరాటం.. తెలంగాణలో విప్లవం! గ్రామాల పాత్ర గ్రామాలదే... హైదరాబాద్ రోల్ హైదరాబాద్‌దే!  ఇందులో తుపాకీ పట్టి కదనరంగంలోకి దూకిన మహిళలూ ఉన్నారు.. ఓవైపు యోధులకు అన్నంపెడుతూ, రక్షణ స్థావరాలు కల్పిస్తూ, ఇంకోవైపు చదువుతో ప్రజలను జాగృతం చేసిన స్త్రీమూర్తలూ ఉన్నారు. ప్రమీలాతాయి, బ్రిజ్‌రాణి, బాజీలు రెండోకోవకు చెందిన చైతన్యస్ఫూర్తులు! తెలంగాణ రైతాంగ పోరాంటో స్త్రీల పాత్ర గురించి ‘మనకు తెలియని మన చరిత్ర’ పేరుతో స్త్రీ శక్తి సంఘటన గతంలో  ఓ పుస్తకాన్ని ప్రచురించింది. దీనికి  కర్తలు.. కె.లలిత, వసంత కణ్ణబీరన్, రమా మేల్కొటే, ఉమామహేశ్వరి, సూసీ తారూ, వీణాశత్రుఘ్న,  ఎం. రత్నమాల!  ఈ పుస్తక రచన సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ప్రమీలాతాయి, బ్రిజ్‌రాణి, బాజీలను ఇంటర్వ్యూ చేసిన రమా మేల్కోటే,  సూసీతారూ ఆనాటి జ్ఞాపకాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.

 

‘సెప్టెంబర్ 17.. సంబంధించి తెలంగాణ జిల్లాల్లోని స్త్రీల పోరాటం వేరు.. ఇక్కడ హైదరాబాద్ మహిళల పోరాటతీరు వేరు. ఇట్ వజ్ ఏ వెరీ లైవ్లీ మూవ్‌మెంట్.. మెయిన్లీ ఎగెనైస్ట్ దొరాస్.. బిగ్ ల్యాండ్ లార్డ్స్’ అని సూసీ నాటి పోరాట విశేషాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే రమామేల్కోటే.. ‘నిజానికి ఇది వెట్టి నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటం. కాబట్టి హైదరాబాద్ ఫోకస్డ్‌గా

 జరగలేదు. అందుచేత ఇక్కడి మహిళలు డెరైక్ట్‌గా ఆ పోరాటంలో పార్టిసిపేట్ చేయలేదు. కానీ సపోర్ట్ చేశారు. బ్రిజ్‌రాణి (రాజ్‌బహదూర్ గౌర్ భార్య), ప్రమీలాతాయి (మహేంద్ర భార్య), రజియాబేగం, జమాలున్నీసా బేగం(ఈమెనే బాజీ అని పిలిచేవాళ్లు).. వీళ్లది ఈ పోరులో

 ఇంకోరకమైన భాగస్వామ్యం’ అని హైదరాబాద్ వనితలను పరిచయం చేశారు.



 పర్‌స్పెక్టివ్..



 ‘ప్రమీలాతాయి, బ్రిజ్‌రాణి, బాజీ వీళ్లంతా  ఉద్యమంలో ఉన్న నాయకులకు సహాయం అందించడం, అజ్ఞాతంలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వడం, మారు వేషాల్లో వెళ్లి వారికి ఆహారం అందించడం వంటివి చేశారు. ప్రమీలాతాయి, బాజీ, బ్రిజ్‌రాణి బాగా చదువుకున్నవాళ్లు. నగరంలోని మహిళలకు చదువు చెప్పడం, మార్క్సిజం మీద అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేశారు. ఇండియాలో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత కూడా బాజీలాంటి వాళ్లు కొందరు ముస్లిం స్త్రీలకు కుట్టుమిషన్లు పెట్టించి చేయూతనిచ్చార’ని రమామేల్కోటే చెప్తుంటే.. ‘హైలీ ఎడ్యుకేటెడ్. షి వజ్ ఏ స్కూల్ టీచర్. మంచి ఇంగ్లిష్ మాట్లాడేవారు. మేము ఆమెను ఇంగ్గిష్‌లోనే ఇంటర్వ్యూ చేశాం. ఆమె మాతృభాష మరాఠీ. దాంతో ఇక్కడున్న మరాఠీ మహిళలందరినీ ఆర్గనైజ్ చేయగలిగింది. ఒక్క మరాఠీ వాళ్లనే కాదు.. తెలుగు వాళ్లను కూడా. వర్కింగ్ క్లాసెస్, మిడిల్‌కాస్లెస్ ఈవెన్ ప్రినెన్స్ ఎస్రా అందరినీ సమావేశపరిచి మహిళల సమస్యలతోపాటు ప్రజల దైనందిన సమస్యల మీదా మాట్లాడేది. అయితే ప్రమీలాతాయి మాకు చెప్పిందాన్ని బట్టి నిజాం, ఆయన భార్య ఎస్రా ఈ ఇద్దరు కూడా దళిత్ ఎడ్యుకేషన్ మీద శ్రద్ధపెట్టారని అర్థమైంది.



ఆ దళిత్ స్కూల్స్‌ని అంబేద్కర్ కూడా విజిట్ చేశాడట. ప్రమీలాతాయి విషయానికి వస్తే షి వాజ్ ఎన్ ఆర్గనైజర్ ఆఫ్ విమెన్. వార్మ్‌హార్టెడ్. సమస్యల్లో, అనారోగ్యంలో ఉన్న మహిళలకు సహాయం అందించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకునేది. షెల్టర్స్ కూడా ఇచ్చేది. పరదా  వేసుకొని రిక్షాల్లో వాళ్లను తీసుకెళ్లేది’ అని సూసీ అంటుంటే.. ‘సూసీ యూ రిమెంబర్ వియ్ ఇంటర్వ్యూడ్ జీనత్ ఆల్సో. విమెన్స్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసేది. ఆ టైమ్‌లో తనెట్లా  పార్టిసిపేట్ చేసిందో చెప్పింది.. చిన్న చిన్న గ్రూప్స్‌తో మాట్లాడటం, మార్క్సిజం, వరల్డ్ హిస్టరీ మీద ఆమెకు అవగాహన ఉంది. ఉర్దూ వరల్డ్ గురించి, స్త్రీలను బయటకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు, వాళ్లకు చదువుచెప్పడం.. వంటి విషయాలు చాలా చెప్పింది. జమాలున్నీసా కూడా ఇలాంటి వర్కే చేసింది. ఇలా వీళ్లందరికీ ఒక పర్‌స్పెక్టివ్ అనేది ఉంది. ప్రమీలాతాయి, బాజీ, బ్రిజ్‌రాణిలాంటి వాళ్లకు ఈ భూస్వామ్య వ్యవస్థ పోవడమనేది పెద్ద మార్పు, ఓ కొత్త  వ్యవస్థకు నాంది అన్నది వాళ్ల భావన’ అని గుర్తు చేసింది రమామేల్కోటే.

 

ప్రైడ్.. సెల్ఫ్‌కాన్షస్




బ్రిజ్‌రాణి కూడా ప్రమీలాతాయిలాగనే. సూసీ నీకు గుర్తుందో లేదో..‘పోరాటంలో ఉన్నవాళ్లకు వంటలు చేయడం, షెల్టర్స్ కనుక్కోవడమనేది పెద్ద బాధ్యతగా ఉండింది మాకు అని చెప్పింది బ్రిజ్‌రాణి’ అని జ్ఞాపకం చేసింది రమామేల్కోటే. ‘అవును.. మూవ్‌మెంట్ విరమణకు ముందు షెల్టర్ ఇవ్వడం చాలా కష్టమైందని బ్రిజ్‌రాణి, ప్రమీలాతాయి’ ఇద్దరూ చెప్పారు అని వాళ్ల మాటలను గుర్తు తెచ్చుకుంది సూసీ. రాజ్‌బహదూర్ వాళ్లింట్లో ఎప్పుడూ ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉండేది. బ్రిజ్‌రాణీ ఆ మీటింగ్స్‌లో పార్టిసిపేట్ అయ్యేది. ఆడవాళ్లను కూర్చోబెట్టుకొని వ్యవస్థ, ప్రభుత్వం గురించి చెప్పేది. చరిత్ర మీద వాళ్లకు అవగాహన కల్పించేది’ అని వివరించింది రమామేల్కోటే. ‘ఎస్ దె హ్యాడ్ దట్ కాన్షస్‌నెస్’ అని సూసీ బ్రిజ్‌రాణి, ప్రమీలాతాయి వ్యక్తిత్వాలను వర్ణించింది. ‘మేమీ పనిచేస్తున్నామనే ప్రైడ్, సెల్ఫ్‌కాన్షస్ వాళ్లలో ఉండేది’ అని రమామేల్కోటే కితాబు ఇచ్చింది. ‘ఎవ్రీ హిస్టారికల్ పీరియడ్ హాజ్ ఇట్స్ ఓన్ ఆపర్చునిటీస్ అండ్ ఓన్ డిమాండ్స్.. సో.. దటీజ్ ఏ డిఫరెంట్ మూవ్‌మెంట్ ఇన్ హిస్టరీ..’  అంటూ సూసీ, రమామేల్కోటే  సంభాషణను ముగించారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top