ధర్నాచౌక్‌ను ఆక్రమిద్దాం

ధర్నాచౌక్‌ను ఆక్రమిద్దాం - Sakshi


- రౌండ్‌టేబుల్‌ భేటీలో టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం

- 21న ఇందిరాపార్క్‌ వద్ద రాష్ట్రస్థాయి సదస్సు  




సాక్షి, హైదరాబాద్‌: ‘సమస్యలను చెప్పుకో వడంతోపాటు సర్కారుపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. దీన్ని కాల రాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రజల హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఇందిరాపార్క్‌ వద్ద నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం దక్కింది. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తేస్తాం, అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు.



ఈ నెల 21న ఇందిరాపార్క్‌ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరవాలి’అని తెలం గాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ ప్రొఫె సర్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. ధర్నా చౌక్‌ పరిరక్షణపై బుధవారం మక్దూం భవన్‌ లో వామపక్ష పార్టీలు రౌండ్‌ టేబుల్‌ సమావే శాన్ని నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ  21న చేపట్టే కార్యక్రమం వద్దే  వంటా–వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా–పాటా, ధూంధాం ఉంటుందన్నారు.  



వైట్‌హౌస్‌ ఎదుటా ధర్నాలు

అమెరికాలో వైట్‌హౌస్‌ ఎదుట కూడా ధర్నాలు చేసుకునే వెసులుబాటు ఉందని, పార్లమెంటు సమీపంలో జంతర్‌మంతర్‌ వద్ద నిరసనల కోసం కేంద్రం స్థలం కేటా యించిందని రాజ్యసభ మాజీ సభ్యులు అజీజ్‌ పాషా అన్నారు. పీవోడబ్ల్యూ నేత సంధ్య మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు లక్షల సంఖ్యలో హాజరైతే లేని ట్రాఫిక్‌ ఇబ్బందులు.. పదుల సంఖ్యతో ధర్నాలు చేస్తే వస్తాయా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నియంత ప్రభుత్వం కొనసాగుతుందని, ప్రజలకు మాట్లాడే హక్కు లేకుండా గొంతు నొక్కే స్తోందని పీఎల్‌ విశ్వేశ్వరరావు అన్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top