తప్పతాగి కంట్రోల్ తప్పిన యువతి..

తప్పతాగి కంట్రోల్ తప్పిన యువతి..


హైదరాబాద్:  హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నెం 12లో అర్థరాత్రి ఓ యువతి మద్యం మత్తులో బీభత్సం సృష్టించింది. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించింది. తప్పతాగి నియంత్రణ కోల్పోయిన ఆమె ...ఓ కారును ఓవర్ టేక్ చేయబోయి ఓ ఐస్క్రీమ్ బండితో పాటు రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐస్క్రీమ్ బండి ఓనర్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షలు చెప్తున్నారు.


ప్రమాదం జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి పరారయ్యారు.  అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు నంబరు ఏపీ 09 సీక్యూ 5544 గా పోలీసులు గుర్తించారు. ఆ కారు రెడ్డీస్ ల్యాబ్ పేరుతో రిజిస్టర్ అయినట్లు సమాచారం.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top