రేపటి నుంచి 3 రోజులు భారీ వర్షాలు


మిర్యాలగూడలో అధికంగా 9 సెంటీమీటర్లు నమోదు

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పేరూరులో 8, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 7, ఏటూరునాగారం, పినపాకల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గోల్కొండలో 5, ఇబ్రహీంపట్నం, వెంకటాపురం, దేవరకొండ, నల్లగొండల్లో 4 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top