ఎస్డీఎఫ్‌ యాక్ట్‌ దేశానికే తలమానికం

ఎస్డీఎఫ్‌ యాక్ట్‌ దేశానికే తలమానికం


జాతీయ సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి



సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్డ్‌ కాస్ట్, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ యాక్ట్‌ దేశానికే తల మానికమని ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎస్డీఎఫ్‌ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందు నుంచే కేసీఆర్‌ దళిత, ఆదివాసీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధాస క్తులతో ఉన్నారన్నారు. సీడీఎస్‌ డైరెక్టర్‌ వై.బి. సత్య నారాయణ అధ్యక్షత వహించిన ఈ సభలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఇటువంటి చట్టం కోసం పౌర, ప్రజాసంఘాలు కృషి చేయాలని ప్రతినిధులను కోరారు.



ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు మాట్లాడుతూ చట్టంలో కొన్ని విషయాలపట్ల త్వరలో రూపొందించబోయే రూల్స్‌లో స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ చైర్మన్‌ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రూపొందిన చట్టం స్ఫూర్తితో వివిధ రాష్ట్రాల్లో చట్టం రూపకల్పనకు త్రిముఖ వ్యూహాన్ని అవలంభిం చాలని కోరారు. కార్యక్రమంలో కొరివి వినయ్‌ కుమార్, డీబీఎఫ్‌ శంకర్, 12 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top