మేనులో వణుకు

మేనులో వణుకు


మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అవయవం ఏదంటే మెదడు. శరీరంలో ప్రతి కదలిక కూ మస్తిష్కం నుంచి వచ్చే

 సంకేతాలే కారణం. మరి ఇంతటి ముఖ్యమైన మెదడులో అనుకోకుండా జరిగే మార్పులు.. శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మెదడులోని ‘బేసల్ గాంగ్లియా’ అనే ప్రదేశంలో జరిగే మార్పులతో ‘పార్కిన్‌సన్’ వ్యాధిబారిన పడే ప్రమాదం ఉంది.

 మెదడులో డోపమిన్ అనే  రసాయనాన్ని తయారు చేసే కణాలకు సంబంధించిన నరాలు ఉంటాయి. పార్కిన్‌సన్ వ్యాధి సోకిన వారిలో ఈ కణాలు వేగంగా  చనిపోతుంటాయి. దీంతో డోపమిన్ రసాయనం తగ్గుతుంది. దీనివల్ల శరీరం బిగుతుగా అయిపోయి, చేతులు, కాళ్లు, వేళ్లు వణుకుతుంటాయని చెబుతున్నారు పార్కిన్‌సన్ వ్యాధి శస్త్రచికిత్స నిపుణుడు గ్లోబల్ హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డా॥ఎ.ప్రవీణ్. ఇటీవల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని  చెబుతున్నారు. పార్కిన్‌సన్ వ్యాధి లక్షణాలు, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల  గురించి ఆయన ఇలా వివరించారు.

 

లక్షణాలు..



►  డోపమిన్ అనే రసాయనం తగ్గేకొద్దీ పార్కిన్‌సన్ లక్షణాలు పెరుగుతుంటాయి

►   గతంలో జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుండేది. ఇప్పుడు సాధారణంగా కూడా వస్తోంది

►   చేతులు, తల వణుకుతుంటాయి.

►   జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదాలు కూడా వణకడం మొదలవుతుంది

►   శరీరం బిగుతుగా అయిపోతుంది. దీనినే రిజిడిటీ అని అంటారు

►  ఆలోచనలు మందగిస్తాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.

►  తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు.

►  నిద్రలో మాట్లాడటం, నిద్రలో నడవడం, పక్కవారిని కొట్టడం వంటివి కూడా జరగొచ్చు.

 

డీబీఎస్‌తో మామూలు స్థితికి  ఈ జబ్బు ఎలా వస్తుందో ఇప్పటికీ పూర్తి కారణాలు తెలియవు.



►   కాబట్టి ఈ వ్యాధిని నియంత్రించడం ఒక్కటే మార్గమని చెప్పుకోవాలి

►  10 నుంచి 15 శాతం రోగుల కుటుంబాల్లో గతంలో ఎవరో ఈ వ్యాధి బాధితులే అయి ఉండవచ్చు

►  పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తులను డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిములేషన్) శస్త్ర చికిత్స ద్వారా మామూలు మనిషిని చేయవచ్చు

►  డీబీఎస్ సర్జరీ ద్వారా రోగి మెలకువగా ఉండగానే మెదడులోకి రెండు లీడ్స్‌ని పంపించి, ఛాతీ దగ్గర చర్మం కింద ఒక బ్యాటరీని అమర్చుతారు

►  ఈ బ్యాటరీ పదేళ్ల వరకూ పనిచేస్తుంది. ప్రోగ్రామింగ్ ద్వారా బ్యాటరీ  నుంచి విడుదలయ్యే కరెంట్‌ను  నియంత్రిస్తారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top