డబ్బు కోసమే కిడ్నాప్ యత్నం

డబ్బు కోసమే కిడ్నాప్ యత్నం - Sakshi


కీలక నిందితుడిని కర్నూలులో

అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్

1998లో ఏపీఎస్పీలో చేరి, 2002లో గ్రేహౌండ్స్‌కు బదిలీ అయిన ఓబులేసు


 

సాక్షి న్యూస్‌నెట్‌వర్క్: అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కంభం నిత్యానంద రెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేసు కిడ్నాప్‌యత్నం, కాల్పుల ఘాతుకానికి పాల్పడింది పోలీసు ముఠాయేనని తేలింది. బుధవారం ఉదయం 7.15 గంటలకు కేబీఆర్ పార్కులో వాకింగ్ చేసి నిత్యానందరెడ్డి కారు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టవర్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు ఓబులేసును గురువారం రాత్రి కర్నూలులో అరెస్ట్ చేశారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితోనే కిడ్నాప్‌కు పాల్పడేందుకు యత్నించానని పోలీసులు విచారణలో ఓబులేసు వెల్లడించాడు.



గతంలో కూడా మాజీ చీఫ్ సెక్రటరీ మనవడిని కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. అదే తరహాలో నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికి పథకం వేశానని చెప్పాడు. దుర్వ్యసనాలకు బానిసైన ఓబులేసు అప్పులపాలుకావడం, మరోవైపు ఆర్థిక  ఇబ్బందులు ఎదురవ్వడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాలోచన అతనిలో కలిగింది. దీంతో పథకం ప్రకారం తోటి గ్రే హౌండ్స్ ఉద్యోగికి చెందిన  ఏకే-47ను తస్కరించాడు. శక్తివంతమైన ఆయుధం ఉన్నదనే ధైర్యంతో ఇద్దరు హోంగార్డులు, మరో కానిస్టేబుల్‌తో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. ధనవంతులు, వారి పిల్లలు వాకింగ్ వచ్చే కేబీఆర్ పార్క్‌పై కన్నేశారు. ఇక్కడ కిడ్నాప్ చేసిన వారిని నిర్బంధించి డబ్బులు డిమాండ్ చేసేం దుకు శివార్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.

 

ఇలా చిక్కాడు: చందనాబ్రదర్స్‌లో బట్టలు ఖరీదు చేసిన రసీదు ఆధారంగా నిందితుడు కానిస్టేబుల్ ఓబులేసుగా గుర్తించిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటన అనంతరం అతను నేరుగా అమీర్‌పేటకు వచ్చి అక్కడ ప్రైయివేటు బస్సులో కర్నూలుకు వెళ్లాడు. బస్సు ఎక్కుత్నున దృశ్యాలు అమీర్‌పేటలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. గురువారం తెల్లవారుజామున కర్నూలుకు చేరుకున్న ఓబులేసు కొత్తబస్టాండ్ సమీపంలోని ఆదిత్య లాడ్జిలో తప్పుడు చిరునామాతో గది అద్దెకు తీసుకున్నాడు.



టాస్క్‌ఫోర్స్ బృందం గురువా రం తెల్లవారుజామున కర్నూలుకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఆదిత్య లాడ్జి రూం నంబర్-111లో ఉన్న  ఓబులేసును మీరెవరంటూ ప్రశ్నించగా... తా ను ఉద్యోగంకోసం వచ్చానంటూ నమ్మబలికాడు.  పోలీసులు మిగతా గదుల్లో తనిఖీ నిర్వహిస్తుండగా వారి కళ్లుగప్పి పరారయ్యాడు. అనంతరం కర్నూలు జనరల్ ఆసుపత్రి ఎదుటనున్న మధుర లాడ్జిలో అద్దెకు దిగాడు.  అరెస్టు చేస్తారనే  భయంతో పురుగుల మందు తాగేందుకు సిద్ధం కాగా పోలీసులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.



12 ఏళ్లు గ్రేహౌండ్స్‌లోనే: ఓబులేసు 1998లో ఏపీఎస్పీలో చేరి, 2002లో గ్రౌహౌండ్స్‌కు బదిలీ అయ్యా రు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ అయ్యాడు. 15 రోజుల నుంచి విధులకు హాజరుకావడం లేదు. ఓబులేసును శుక్రవా రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నా యి. ఓబులేసు కాల్పుల ప్రచారంతో స్వగ్రామం వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం ఉలిక్కిపడింది. అతని తండ్రి మైఖేల్‌ను పోలీసు లు విచారించగా ఓబులేసు రెండేళ్లుగా గ్రామానికి రాలేదన్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. అతడు అవి వాహితుడు.  ఈ నేరం చేశాడంటే నమ్మలేమని బంధువులు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top